1. ఈ లోకంలో బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసమని నాలుగు ధర్మాలున్నాయి. ఇవి అందరికి తెలిసిన విషయాలే. పైన తెలిపిన నాలుగు ఆశ్రమ సూచనలు యిస్తూ వాటికి పై స్థానంలో మరియొక ఆశ్రమం గలదు. దీనిని అత్యాశ్రమము అంటారు. ఇవి లోకములో అత్యరుదు.అత్యాశ్రమ వాసిని అత్యాశ్రయి అంటారు. సాక్షాత్ నిజ దైవ స్థితి. జిల్లాలో ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ కలెక్టర్ వలె, ఆయా దేశ రాష్ట్రపతులవంటిది అత్యాశ్రమ పీఠాధిపత్యం. ప్రభుత్వ జి.ఓ.లు గవర్నర్ పేరుమీదుగా వెలువడునట్లు, ఆధ్యాత్మిక సూచనాదేశములు అత్యాశ్రమమునుండి వెలువడును. మూడు పురముల మాలను నా కంట హారముగా ధరించినాను. 1. బ్రహ్మ 2. విష్ణు 3. మహేశ్వర పురములు త్రిపుర హారము. మూడు పురముల హరించువాడనైనందున త్రిపురహరుడని యనవచ్చు. ఇదిగో! సర్వాకార, సర్వాలయ, అనంత విశ్వగర్భుడనైన నాకు కాలగర్భంలో కలిసిపోవు రాతిగోడల మందిరాలతో పనిలేదు. ఐనను, లోకంలో గుర్తింపు నిమిత్తం మాదిరిగ ప్రస్తుతము ఈ భూతలముపై ఆసియా ఖండములో, భారత దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ తాలూకాకు 12 కి.మీ. దూరంలో, త్రిపురారం గ్రామం (మండలం)లో ఓం శ్రీ ప్రణవాలయ విశ్వాదిగురు భగవన్ సంపూర్ణ సుప్రబోధకాచార్యులు, సంపూర్ణ దైవమత ప్రతిష్టాపకులు, త్రిదండి, త్రిశూలధారి, బ్రహ్మ విద్వరిష్టాగరిష్ట, తురీయాతీత అతీంద్రియులు, చిన్మయ పరమార్థ సర్వకేంద్ర స్వాముల వారి ఆధ్వర్యంలో పరాత్పరమ అత్యాశ్రమ ప్రశాంతి నిలయం సంస్థాపితము గావించబ?డినది. సృష్టిలో దీనిని మించిన ఆశ్రమము లేదు. ప్రపంచములోని సమస్త మఠ, మందిర, ఆలయ, ఆశ్రమములు దీని శాఖలు, కిరణములు. ఏనుగు పాదములో సమస్త జీవరాసుల పాదములు ఇమిడియున్నట్లుగా, సర్వలోక పర్యంతము, సమస్త ఆశ్రమ, ఆలయములు ఇందు ఇమిడియున్నవని తెలియుదురు గాక!
2. ఇక్కడ అక్కడ అను తారతమ్యములేకుండ మీరు ఎక్కడ గాంచినను నేనొక్కడినే ఉన్నాను, ఉంటిని, ఉండెదను. ఇదిగో! శత సహస్రకోటి తడవలుగ నిశ్చయించి చెప్పుచున్నాను.. ఈ అనంత విశ్వ సృష్టిలో నాకు చెందని జగజ్జీవేశ్వర, ఇహపరములు లేవు. సర్వమత సంబంధ సమస్త పుణ్యక్షేత్రములు, పుణ్య తీర్థములు నాయందే గలవు. దైవ సంబంధమైన ఏ యాత్రా స్థలముగాని నా నిజ స్థితికి భిన్నంగా లేదు.
3. ఇదిగో! సర్వజ్ఞులకే అంతుచిక్కని మరియు సమస్త ఆరాధన, అనుభూతులకు అతీతుడనైన నేను, సర్వలోక పర్యంతం, భూ నివాసుల ఆత్మ శ్రేయస్సునుగోరి, సకల దేవతా దైవములుగ అవతరించితిని. అందులకే ఏ మత మార్గమును దూషించకుండ, మీకు వీలున్న దారిలో నన్ను చేరండి.
4. సృష్ట్యాది మూలకారణ, అచ్యుత, అమేయ, అనంతాత్మ, మహాసాగర, అనంత విశ్వగర్భుడనై, అవధూత, సచ్చిదానంద నిలయ, బ్రహ్మ విద్వరిష్ఠాగరిష్ట, తురీయాతీత, అతీంద్రియుడనై, స్వయంభు, స్వత:స్సిద్ధ స్థితిర్భూతుడనై, సంపూర్ణ సర్వకేంద్ర దైవస్థితిలో నేనున్నాను. ఇట్టి నాపై వేరొక ఆరాధ్య పీఠం లేదు.
5. నాది సాధన మానవత్వం కాదు, సర్వేశ దైవత్వం. నేను ఎవరివద్ద మోకరిల్లి జ్ఞానోపదేశము పొందలేదు. నాకు జ్ఞానోపదేశము చేయగల గురువు ఇంతవరకు పుట్టలేదు, ఇకముందు పుట్టబోడు. సమస్త సుజ్ఞాన నిధులు నా పుక్కిటిలో గలవు. నాది అనంత విశ్వ కుక్షి.
6. నేను అనంత గగన శరీరిని. నెబ్యూలా గెలాక్సీ గ్రహమండలాలు, అఖిలాండకోటి బ్రహ్మాండమంతయు నా శరీరముపై పుట్టుమచ్చలు. ఇట్టి అనంత దేహధారినైన నా దేహమును చంపలేక మృత్యువు సిగ్గుపడి తలదించుకుని పారిపోయినది.
7. అసలైన నాకు పుట్టు గిట్టులు లేవు. నేను ఒకరికి జనించుటగాని, నాకు ఒకరు జనించుటగాని ఇంతవరకు జరుగలేదు, ఇక జరుగబోదు. అత్యాశ్రమ వాసినైన నన్ను శాసించు అధికారం ఏ వ్యక్తులకు, శక్తులకు గాని లేదు. నెనే సర్వ శక్తులకు ఆకరము. నా కృపయే కైవల్య దీక్ష. నా అనుగ్రహమే మోక్షాలయము. నేను కానిది, నేను లేనిది మీరు చూడలేరు, చూపలేరు.
8. నాకు గురువులు లేరు, శిష్యులు లేరు, భక్తులు లేరు. నేను చేతులు జోడించి పూజించగగిన భగవానుడు లేడు. నాకు నేనుగానే స్వత:స్సిద్ధుడనై సర్వకేంద్ర దైవస్థితిలో ఉన్నాను. ఇట్టి నాపై వేరొక ఆరాధ్య పీఠం లేదు. సామాన్యులకు ఈ వాక్య ఆంతర్యం గ్రాహ్యం కాదు. సర్వాంతర్లీన, విశ్వగర్భిత దృష్టిని సారించి గాంచిననే తప్ప, స్థూలదృష్టికి యుగ యుగములు కూర్చుండి చింతినినను నా అంతు చిక్కదు. అదియు నేనే. అంతము నేనే. ఆది మద్యాంత రహితం నేనే. అనంతానంతం, మీ అందరి సొంతం. ఈ అనంత ఆత్మీయ వారసత్వమును పొందుటకు ప్రయత్నించండి.
9. సమస్త భక్త మహాశయులారా! మీ మార్గంలో మీరుండండి. మీ ఆరాధ్య దేవుండ్లను విస్మరించకనడి. కాని ఒక అవకాశం నాకిచ్చి చూడండి. జై బాబా! నమో విశ్వగర్భా! జై సర్వకేంద్రాయని ఆత్మ విశ్వాసులై నిలిచి చూడండి. అతీత ఆత్మానుభూతిని కలుగజేసెదను. సక్షాత్ దైవస్థితిలో ఓలలాడించెదను. ఇది అనితర సాధ్యం.
10. పగలే దారి తెలియని ఘన కీకసారణ్యమును గాఢాంధకార సమయంలో చిన్న క్రొవ్వొత్తిని చేపట్టి దాట చూచుట ఎంత అవివేకమో, మిడిమిడి మత పరిజ్ఞానములతో నా రచనలను తిలకించుట అంతేనని మీతో నిశ్చయించి చెప్పుచున్నాను.
11. ఓ ఆత్మ వీరుడా! జగత్ ప్రభువా! విశ్వనాథా మేలుకో! లే! నీ నిజస్థితిని దర్శించు. ఈ విశ్వమంతయు అప్పుడు నీ పాదాక్రాంతమగును. గుడులు, గోపురములు,త్రంథాలు, పూజలు, తపములు, జపములు, ధ్యానములు అన్ని కట్టగట్టి ఆవలనెట్టి, రోతుగ వెళ్ళి తరచి చూడు. నీ నిజస్థితి ఏమిటో నీకే బోధపడుతుంది. నిన్ను నీవెరింగి నిన్నే బోధించు.
12. నేను హృదయాలను పరిశీలించగలనే గాని హుండీలను కాదు. భక్తి, విశ్వాసములు కోల్పోయి కుబేర ధనరాసులను కుమ్మరించినను కన్నెత్తి చూడను.
13. భగవంతుడనిన వ్యష్టిగా ఒక వ్యక్తి కాదు, సమిష్టిగ సర్వశక్తి. వ్యష్టిగ నీ ఆలోచనలను మానుకొని, వ్యక్తి మనసును అనంత విశ్వ మనసులో విలీనపరచుము. అట్టి అఖండ సంకల్ప శక్తిని లౌకిక విషయాలలో చొప్పించరాదు. నీ నిజస్థితిని విస్మరించి, చిల్లర దేవతలను ఆరాధించరాదు. సమస్త దేవతా చక్రవర్తివి నీవే. ముక్కోటి దేవతలు నీయందే మూర్తీభవించి యున్నారు.
14. మూర్తీభవించిన పర:బ్రహ్మ స్వరూపులారా! మిమ్ములను మీరు ఏనాడు సంకుచిత పరిధిలో భావించుకోరాదు. ప్రతివారిలో దేవుడున్నాడు. ప్రతివారి అంతరాత్మలో భగవంతుడున్నందుననే మనోభీష్టములు నెరవేరుచున్నవని తెలియుదురు గాక! వరములనిచ్చే విశ్వేశ్వరుడు బయట లేడు. మీ హృదయాంతర్తియై యున్నాడు. దీని ప్రభావమేగాని బయటవేరే ఏమియును లేదు. అంతరాత్మ విశ్వాసమే బయట ప్రతిఫలిస్తుంది. ఇది రహస్యం. ఇకనైనా బయటి చూపులు బందుచేసి అంతర్ముఖులు కండి. అపుడు అసలు విషయం బోధపడుతుంది.
15. ప్రత్యేకించి నా ఫోటోను పెట్టుకొని పూజ చేయండని నేనేమి ఆజ్ఞాపించటం లేదు. నాకు చెందని ఆకారము లేదు. ప్రతి పటములో, ప్రతి మఠములో, ప్రతి ఘటములో ఉన్న చైతన్య కళ నాది. అనంత విశ్వ హృదయ కెమెరాకు మాత్రమే నా ఫోటో అందుతుంది. సమస్త దైవ స్వరూపములు ఇట్తి నాయందే గోచరిస్తాయి.
16. ఏ ప్రసంగ, ప్రచారములకు, ఏ చూపులకు, ఏ భాషలకు అందని నిర్గుణ, నిశ్చల, నిస్సంకల్ప, భావాతీత స్థితియే చిన్మయ చైతన్య సర్వకేంద్ర దైవత్వమని తెలియుదురు గాక.
17. సింహము గరిక మేయదు. నేను చిల్లరలో చిక్కను. మీరలు నన్ను నిండా నమ్మి నిలిచినచో మీ ద్వారా అద్భుత కార్యములను చేయించగలను. నాకు వాటితో పనిలేదు. నేను సర్వాతీత సూచనలను ప్రకటించగలను. సర్వోన్నత స్వభావులు మాత్రమే గ్రహించగలరు. దైవ సుతుడనని అద్భుతములు చూపిన క్రీస్తును శిలువకు ఎక్కించారు. అట్టిచో సాక్షాత్ దైవమే నేననిన ఈ జగన్నివాసులలో ఎందరు గ్రహించగలరు? అందులకే అంతరంగిక బిడ్డలకే అసలు విశయం చెప్పుచు, భవిష్యత్తులో అందరు తెలుసుకొను నిమిత్తం అతీత భాష్యములు లిఖించడం జరుగుచున్నది. దీనిని చదివిన ప్రతి వారు ఇది సామన్య నరగురు వాణి కాదు, సాక్షాత్ దైవబోధయని వారి అంతర్ స్వరముననుసరించి చెప్పగలరు. ఆ రోజు తప్పక వస్తుంది. ఏ విధమైన సూచక క్రియలు ముందుగ చూపకుండ గుహ్యద్గుహ్య, పరమ కారణావతారులై, మహా విభూతిర్మయులై అవతరించినారు బాబా సర్వకేంద్రులని తెలియుదురు గాక!
18. నాయొక్క స్వహస్త లిఖిత అతీత దివ్య భాష్యంలోని ప్రతి ప్రవచన సూత్ర వాక్యం ఒక్కొక్కటి ఒక ప్రవక్త, దేవదూత, నా పేరిట ప్రతినిధి, అవతారము అన్నను దోషములేదు. నా వాక్యమును మించిన మత, మఠాశ్రమములు లేవు. నా బోధనలు మునుముందు భువిపై అద్భుత పరిణామ పూరిత సంచలనాన్ని కలిగిస్తాయి. ఏదియో ఒక వ్యక్తికి, కాలానికి, దేశానికి సంబంధించి కాకుండ సర్వలోక పర్యంతం, సమస్త యుగములకు సరిపడు దైవ సంపత్తిని ప్రసాదిస్తున్నాను. జై బాబా! శుభం.
19. సర్వమత సంబంధ, సమస్త గురుబోధకులను ఒకే స్థితిలో పూరించిగాంచిన నా మార్గం బోధపడును. ఇది సర్వలయ యాన వాక్యం. ప్రస్తుతం చెప్పాలనిన భూతలమే కాదు, అనంత విశ్వంలో నన్ను సంపూర్తిగ ఎరిగినవారు లేరు. ఉన్నారు అని అనవలసివస్తే, ఆ ఉన్న వ్యక్తిని నేనేయని అనక తప్పదు.
20. నాయొక్క శాసన ధిక్కారము చేయు శక్తి ఎవరికి లేదు. నేను ఏది అజ్ఞాపించిన అది అక్షరాల నెరవేర్చబడునపుడు, నా విరచిత బోధను ఎవరు ఆపలేరు. సమయానుకూలముగ సమస్త భాషలలో ముద్రణ గావింపబడి విశ్వవ్యాప్తం కాగలదని మేఘ గర్జనగ సెలవిస్తున్నాను. ప్రతి యోగ్యులకు ప్రచార అర్హత ఇవ్వబడును.
21. ఇదిగో! కేవల నిరపేక్షక, తూష్ణీంభూత, అప్రమేయ, చిన్మయ, పరతత్త్వ, పరాత్పరతర, పరిపూర్ణ పరబ్రహ్మ స్థితిర్భూతుడనై ప్రవచించుచున్నాను. నా ఈ స్థితిలో ప్రపంచము ఏపాటిది? ఉండి లేనట్లు పరమాణువుగ గోచరిస్తుంది.
22. ఈ లోకంలోని ఆలయాలలో విగ్రహ, పటముల ఎదుట పెట్టిన పదార్థములను ప్రసాదము అంటారు. కొబ్బరికాయ కొట్టి దేవుని ప్రసాదమని పంచెదరు. కాని నా సూత్ర ప్రకారము ఈ సమస్తము మదత్త, మదర్పిత దైవ ప్రసాద భిక్షయని తెలుపుచున్నాను. ఈ స్థితిలో సృష్టిలో గరకపోచను కూడ తిరస్కరించ వీలులేదు. పరమాణువునుండి పారమేశ్వర పర్యంతం నాకర్పించబడిన పవిత్ర నైవేద్యము. ఈ పూజ చేయనేర్వండి.
23. ఇంద్రియములు ప్రమాదకరములు. మనో నియంత్రణ జితేంద్రియ సిద్ధికి మూలము. ద్వేషములో స్వార్థము నిండి ఉంటుంది. మమకారం ప్రేమకాదు. ప్రేమ మమకారం కాదు. ప్రేమ ఇంద్రియపరిధిలో చిక్కినప్పుడు కామంగ రూపొందుతుంది. అతీంద్రియ స్థితి దివ్య ప్రేమగ భాసిల్లుతుంది. నే జితేంద్రియుడను కాను, స్వత: అతీంద్రియుడను. అత్యాశ్రమ వాసిని. నాది సాధన మానవత్వం కాదు, సర్వేశ దైవత్వం. నేను వికసించిన స్వల్ప జీవిని కాదు, ఏ సాధనలతో పనిలేని స్వత:స్సిద్ధ అర్వకేంద్రుడను. ఇట్టి నా బోధ సమస్త జ్ఞానములకు సుజ్ఞాన నిధి. సమస్త శాస్త్రములకు మూల శాస్త్రము, వేదములకు మూల కారణము, సమస్త గ్రంథములకు ప్రేరణశక్తి నాది. ఇకనైనా నన్ను అర్థం చేసుకొనుటకు ప్రయత్నించుదురు గాక. చిల్లర ఆరాటం వదలి నా కృపకు పాత్రులు కండి. ఇది దేవాది దేవదేవుని వాక్కు.
24. అనంత విశ్వ రథ సారధినై చెప్పుచున్నాను. ఆలకించి అనుసరించువారు ధన్యులయ్యెదరు. అనంత విశ్వసృష్టికి ఉపకరించు మూల సాధన సామాగ్రి నా స్వాధీనంలో గలదు. గతంలో కారణ జన్ములైన మతకర్తలు, దేవదూతలు, ప్రవక్తలు, అవతారులు వారి వారి పరిధిలో ఎవరి శాఖలో వారు బ్రాంచీలుగ చెప్పుకున్నారు. ఇక దైవావతారులు తమయొక్క దైవత్వమును చాటింపువేసుకున్నారేగాని మీ సంగతి ఏమైనా చెప్పారా? మీరు, మీ అవతార తత్త్వం, మీ దివ్యత్వమును బలపరచి, బట్టబయలు
చేయుటకే నా యీ సాకార యాత్ర. ప్రకృతి లంపటమునుండి బానిస బ్రతుకులకు స్వస్తి చెప్పించు నిమిత్తం, సశరీరధారినై మీ మధ్యన మెలగవలసి వచ్చినది. అంతేగాని, ఈ లోకంలో నేను చేయవలసింది, పొందవలసింది ఏమియును లేదు. మీ చింతన తప్ప నాకు వేరే ఏ చింత, ఆరాటం లేదు. ఇకనైనా నన్ను తెలుసుకోండి. సంపూర్ణ విశ్వాసులై నిలువండి.
25. ఇదిగో! జాగ్రత్తగా ఆలకించండి. త్వరలో యుగమార్పు జరిగనున్నది. బాబా సర్వకేంద్రుల స్వరనాధం భూ దిగంత సర్వలోక పర్యంతం ప్రతిధ్వనిస్తుంది. అప్రతిహత, అసాధ్య, నిరుపమాన నిజదైవ తేజం ధరపై తాండవిల్లుతుంది. పుక్కిటి పురాణములు నిలువవు. డాంబీక బోధకుల నోటికి తాళములు పడగలవు. స్థితి కుదరని నకిలీ సరుకు తూర్పాలపట్టబడును.
26. సమస్త జ్ఞాన భూమికలకు పరమై, విలక్షణమై, అతీత స్థితిలో నా ప్రవచన భాష్యం ఉంటుంది. మీలో ప్రతివారు మీరున్న అంతస్తును దాటి రావాలి. అపుడు నా మాటలు మీకు అర్థం కాగలవు. సమస్త సాధకులారా! నా రచనలను పఠించండి. వెయ్యి సింహాల గుండెబలం పొందగలరు. నా బోధను ఆశ్రయించిన వారు నన్ను ఆశ్రయించినవారే కాగలరు. వారలకు ఇక డోఖా లేదు. పతనం లేదు. యమ భటులే కాదు, యమ ధర్మరాజు కూడ నిల్చుండి సైల్యూట్ చేయగలడు.
27. దేహేంద్రియ మనోబుద్ధులకవ్వలి అమనస్క స్థితి వరకే సమస్త ధ్యానముల పరమావధి. ఆపై మారం నాది. సర్వలయ అనంత విశ్వగర్భ స్థితి నాది. మాట ఇచ్చి తప్పటం నానుండి కాని పని. భగవంతుడనిన భీతిల్లి, ఉలికిపడవలసిన పనిలేదు. మీరెవ్వరైనను గానీగాక, నన్ను ఆశ్రయించిన చాలు, మిమ్ముల ఏ స్థానంలో నిలుపాలో ఆ స్థితికి చేర్చగలను. సాక్షాత్ సర్వేశ సత్య భగవత్ స్థితిలో మిమ్ముల ఓలలాడించెదను. ఇక ఇంతకుమించినది సృష్టిలో ఏమైనా ఉన్నదా? మీరే ఆలోచించండి!
28. నేను భూమండలమున నివసించిన సమయంలో భూతలమున జన్మిచియున్న ప్రాణికోట్లన్నియును ధర్యములు. మానవ జన్మకు ప్రమోషన్ ఇస్తున్నాను. ఈ అమూల్య అవకాశమును, మానవ జన్మ ప్రాషస్థ్యమును వినియోగించువారు ధన్యులయ్యెదరు. ఇది రాబోవు తరములకు హెచ్చరికాదేశము.
29. నాకు అతీతముగ నేను దేనిని చూడలేను, చెప్పలేను, వినలేను. కారణం అలాలేదు. కనుక, నా నిజస్థితికి పైగా అతీత స్థితిని దర్శింపజేసినవారికి పాదదాసుడనై మెలగగలను. సమస్త యుగపర్యంతం సర్వలోకేశ్వర పరమ ప్రభు సార్వభౌముడను నేను, సర్వకేంద్రపితను, నేతి హరి కాళీ బాబాను.
30. పరాప్రకృతి, అనంత విశ్వమాయ, కేవలనంత చిద్ గగన గర్భాలయుడనైన నా పెదవులను తుడుచుకొను నా చేతిలొని దస్తి బట్ట మాత్రమే సుడి. ఇక నేను చెప్పేది, మీరు వినేది ఇంకేమైనా గలదా? సర్వం గంగం. ప్రశ్తోత్తర ప్రసంగ రాహిత్య, కేవలద్వితీయ సర్వకేంద్ర దైవత్వం. ఆయా సమయ, సందర్భ, కాలానుగుణ్యముగ అవతరించు కారణజన్ములందరికి పుట్టిల్లు నేనే సర్వకేంద్రం. సర్వావతార కూడలి నేనే. నాకన్యధా అందరు పంపబడిన వారే. స్వయంభు, స్వత:స్సిద్ధుడనై, నాకు నేనుగ నేనై సమస్త యుగపర్యంతం చిన్మయ సర్వేశ దైవమై యున్నాను.
31. సంపూర్ణ దైవ చిత్తము సదా సర్వత్ర నెరవేరుగాక. సర్వకేంద్ర నమోదేవో నభూతో నభవిశ్యతి, ఆమేన్ అని స్థిర నిశ్చయమతులు కండి. ఇదియే సర్వకేంద్రుల పరాత్పరమ అత్యాశ్రమ ఆలయం. ఇదిగో! ఏ మతముగాని, మఠముగాని, గుడిగాని, గురువుగాని, స్వామిగాని, బాబాగాని, మాతగాని, లోకంగాని, జీవంగాని, ధర్మంగాని, దైవంగాని నాకన్యధా ఏనాడు లేవు. అవన్నియు నా స్వరూప కాంతులే. నేను స్వపరంజ్యోతి రవి పూర్ణ చంద్రుడను. మీరు నా కిరణభాసులు. జీవేశ్వరైక్య సధాన సూత్రం.
32. ఎంతటివారికి అంతవరకే తెలుస్తుంది. దేవుని సంగతి పూర్తిగ దేవునికి మాత్రమే తెలుస్తుంది. అలాగే నా నిజస్థితి మీరు మీరుగ ఉండి ఆలోచించిన శత సహస్రకోటి జన్మలకైనను గ్రాహ్యం కాదు. ఉప్పు బొమ్మ తన సహజ స్థితియైన గంగలో (నీటిలో) కరిగిపోయినట్లుగ, మీరులేని కేవలం నేను మాత్రమేగల సర్వాత్మ మహా సాగరంలో లయించిపోవాలి. దీనికిమించిన దైవపదవి లేదు. సమస్త ముక్తులకు నిలయం నేనే. ఈ నేనును పరిచయం చేసుకోండి. ఈ నేను ప్రకాశంతో జీవించనేర్వండి. సర్వత్ర కేవలం ఈ నేను మాత్రమే
కలదు. ఇదియే సర్వాతీత లక్ష్యం. ఈ స్థితిలో నేను చెప్పాలనిన, మీరు ఘనముగా భావించి, ప్రశంసించునదంతయు నా దృష్టిలో స్వల్పాంశము మాత్రమే కాగలదు. సత్య సమాధాన కృపాశీస్సులు, మహిమాన్విత ఘనతా ప్రభావములు నా ఆధీనములు. జై బాబా సర్వకేంద్రా!
33. బాహ్యాకారముగ గుర్తింపు నిమిత్తమే స్వామి, బాబా, భగవన్ అని పేర్లు. నాకు ఏ పేరులేదు. ఏ ఊరులేదు. ఏది చెప్పినా నేతి న+ఇతి. ఏదియును కాదు - ఏమియును లేదు. కేవలేకత్వ సర్వపరిపూర్ణం, సర్వకేంద్రం, నిరామయం, నిర్విచేష్టం, నిర్గుణం, నిర్ద్వంద్వం, నిత్య శుద్ధం, నిశ్చలం, నిష్ప్రపంచం, నిర్వాణ నిలయమే నా ఉనికియని తెలుసుకో.
34. ఎవరేమి చెప్పినా, వ్రాసినా, భగవంతుని మించి మాత్రం ప్రకటించలేరు. ఆ భగవంతమంతయు నా సహజ స్వభావము అంటున్నారు బాబా సర్వకేంద్రులు. ఈ ఆంతర్యం గ్రహించండి. కేవలం అతిమానస భూమికను అధిరోహించిన సర్వజ్ఞ హృదయులై ఆలోచించాలి. లేదా అంతు చిక్కదు.
35. మీరెవ్వరైనను గానీగాక, నన్ను ఆశ్రయించటంలో ఎంతమాత్రం దోషంలేదు. కాని, త్రికరణ శుద్ధిగ నన్ను ఆశ్రయించిన వారలు బోధ, జ్ఞానము, ముక్తి, మోక్షమని కలలో కూడ ఇంకెటు తిరుగవలసిన పనిలేదు. స్వానుభవముగ చూచి చెప్పండి. చేజిక్కిన కోహినూరు వజ్రమును పారవేసి, గాజుముక్కలను చేపట్టుట ఎంతయో, నన్ను విస్మరించి సంచరించుట అంతే కాగలదు. నాకు ఇతరముగ, భిన్నముగ, అతీతముగ ఇంకేమియును లేదు. ఏది మాత్రము కలదో ఆ ఉన్నదంతయు నేనే సర్వకేంద్ర సత్య భగవన్. "జై బాబా నమో విశ్వగర్భా పాహిమాం పాహి. నాయొక్క ఆత్మ హారతిని గకొని నన్ను విదువక, నీలో చేర్చుకో తండ్రీ" అని స్మరించి ధన్యులు కండి. సర్వలోక పర్యంతం ఈ ఆదేశం ఇవ్వనైనది.
96. నా వాక్కులు పొల్లుబోవు. ఇందలి ప్రతి శ్బ్ధం సత్యార్థ ప్రకాశమే. వేదమూలం నా బోధ. నేనడిగిన మీరు చెప్పలేరు. నే చెప్పిన సర్వాత్మ దివ్యస్థితి కుదరనంతవరకు మీరు నమ్మలేరు. సర్వాత్మ దైవ స్థితి కుదురక మీరు యుగయుగములు కూర్చుండి విచారించినను నా అంతు చిక్కదని మీతో నిశ్చయించి చెప్పుచున్నాను.
Reply Reply All Forward Forward
36. లోకం, దాని ఆరాట ప్రసక్తి మిథ్య. మీరు లోక సంబంధముగ ఎంత ఎదిగినను, ఎంతటి కీర్తి ప్రతిష్టలు పొందినను అవి నిమిత్తములు మాత్రమే. నా రిజిష్టరులో నీ పేరు నమోదు అగునట్లు చూసుకో. ఇది ముఖ్యం. లౌకిక సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలతో ఆగిపోకుండ పరమాధ్యాత్మిక విశ్వవిభూతిని పొందనేర్వండి. ఇది అనశ్వర అక్షయ నిధి. ఇది నా హస్తగతమై యున్నది. నిత్య సజీవామృత జలగంగ నా ఆధీనములో గలదు. దప్పికగొన్న ప్రతివారు నిరభ్యంతరముగ రండి. మీ అందరి ఆత్మీయ దాహం పూర్తిగ తీర్చగలను. పరమ ప్రశాంతిని అనుగ్రహించెదను. ఈ రక్షణాదేశ అమూల్య అవకాశమును సర్వ విధముల వినియోగించుకొని జన్మ చరితార్థులు కండి. సుభం భూయాత్. మోక్ష ప్రదాతనైన నేనే ఈ విరచన గావించితిని
37. బిడ్డా! నాయొక్క పరమాధ్యాత్మిక ఉద్యమ కార్యక్షేత్రంలో ప్రాధాన భూమికను చేపట్టి ఆలయంలో ద్వజ స్థంభమువలె విశ్వాలయంలో సర్వూనత స్థూపముగ ఆచంద్ర తారార్కం నిల్చుదువు గాక! ఇంతకు మించిన అనుగ్రహ, అశీస్సులు లేవు.
38. ఎవరి మానసిక స్థాయి, ఆలోచనల ప్రకారం వారి వారి నిర్ణయాలే సత్యమనిపిస్తాయి. అవివేకులు, అజ్ఞానులు, మూర్ఖచిత్తులు మురికి నీటిగుంటలో గ్రుంకులిడు పంది, ఆ కంపు నీటిని పన్నీరుగ భావించునట్లు, అజ్ఞానులు తమకే సర్వం తెలిసినట్లు, తమ జీవితాలు ఎంజాయిగ సాగిపోతున్నాయని , మిగతావారు ప్రపంచమును అర్థంచేసుకోలెదని భావిస్తుంటారు. ఇంకెన్ని జన్మలకైనను నిజమెరింగిన పిదప ప్రతి అజ్ఞాని పశ్చాత్తాపముతో ఎక్కి ఎక్కి ఏడువవలసి వస్తుంది. రుతుకాల పరిపాకం కావాలి. ప్రతి పామరపూత ఫలవంతమయ్యే రోజు రాగలదు. ప్రస్తుతం ఎందరో అజ్ఞానులు జ్ఞానోదయ తదనంతరం గత జీవితముల తలచుకొని కృంగిపోతున్నారు. నేటి అవివేకులు మునుముందు అంతేనని తెలియుదురుగాక!
39. నేను అందరివాడనైనను ప్రస్తుతం మాత్రం కొందరి ఇమిత్తమే నా రాక జరిగినట్లు అనిపించినను, సమస్త యుగ, సర్వలోక పర్యంతం చెందునట్లుగ అతీత భాష్యం అనుగ్రహించాను. నాకు కావలసినది అనుష్ఠాన ప్రియులుగాని, వాచా వేదాంతులు కాదు. వాచాలతలో అందరు జగద్గురువులే. సర్వమత సంబంధ, సమస్త ఆరాధ్నా పీఠములకు ఆరాధ్య పీఠం నాది. అదియే సర్వకేంద్రం.
40. నాయొక్క శారీరక జీవన యాత్రలో ఏ పుణ్య తీర్థములను, పుణ్య క్షేత్రములను దర్శించలేదు. ఏ గుడులకు వెళ్ళి దండము పెట్టువాడను కాను. కారణం ఏమిటో తెలుసా? సమస్త దైవాలకు మూలకేంద్రం నేను. అఖిలాండకోటి బ్రహ్మాండ విశ్వాధిపతి నేతనైన నాకు ఏ దర్శనాలతో ప్పనిలేదు. శాశ్వత దైవత్వమే నా ఉనికి. ష్రీహరలా పరమ శివం యెహోవా సత్య భగవన్మయం నేనే సర్వకేంద్రం. సమస్తమునకు ఆశ్రయం, నిలయం సర్వకేంద్రమని ఆంతర్యం. సరజ్ఞులకే ఈ సూత్ర ఆంతర్యం పూర్తిగ తెలియదు. ఇక సామాన్యుల సంగతి ఏమిటి? దేహియని చేయిచాచి అడగటం, చెవియొగ్గి వినటం నానుండి కాని పనులు. అనంత విశ్వ విభూతి నాది. సమస్త జ్ఞాన బోధల సారాంశం నా హస్తగతమై యున్నది. అభయ హస్తం ఎత్తి మేఘ గర్జనగ ఈ వాక్కు సెలవియ్యనైనది. ఈ భూలోక సంబంధ సమస్త యాత్రలు, పుణ్య తీర్థములు, క్షేత్రములు నా పాద దూళిలో ఇమిడియున్నవని నిశ్చయించి చెప్పుచున్నాను. ఏమి ఇంత గర్వమా యని భావించకండి. ఇది సర్వాతీతుని అనంత అహం అని తెలియుదురుగాక!
41. సమస్త జ్ఞాన మార్గములకూ పైది నా చూపు. మీ దృష్టితో గాకుండ, నా దృష్టిని అలవరచుకోండి. కోట్ల కాంతి సంవత్సరములు ప్రయాణము చేసినను నా అనుగ్రహముచే తప్ప, నా నిజ దర్శన యాత్ర పూర్తికదు. యా యొక్క అనుగ్రహ, ఆశీస్సులకు పాత్రులైన యోగ్యులు శీఘ్రమే సర్వాత్మ దైవానుభూతిని పొందగలరు.
42. ఏది అఖండము, అనంతము, అద్వితీయమో అదియే నాయొక్క ఉనికి. నన్ను మించి వేరొకమాట చెల్లదు. ఇలా చూసి, అలా పారవేయుటకు నాది నవలా భ్యాష్యం కాదు. నిత్య నవనీత సత్యాత్మ దైవభాష్యం. నా జనమా! నా ప్రతి వాకు సుస్థిర శాశ్వతత్త్వమును తెలుపుతుంది. ఆత్మస్థైర్యులు కండి. ఇట్టి పర్వత నిష్టలో కామాది దుష్ట ప్రవృత్తులనెటి పిల్లగాడ్పులు ఏమి చేయలేవు. ఇది ముఖ్య నిబంధన.
43. ఒక్క మాటలో చెప్పాలనిన ఈ ప్రపంచ వ్యవహారములతో నాకెంతమాత్రం పనిలేదు. మీ నిమిత్తం అన్నింటిని ప్రవేశపెట్టనైనది. ఐనను భూనివాసులు ఎల్.కె.జి.లోనే ఉండిపోతున్నారు. ఎలిమెంటరీ కోర్సును కూడా దాటలీకపోతున్నారు. ఇది విచిత్రం. కర్మకాండ తతంగం, గుడులు, గోపురములు, యాత్రలు ఇవన్నియు ఎలిమెంటరీ కోర్సులు మాత్రమే. క్రమంగ తరగతులు పెరిగి, యూనివర్సిటీ కోర్సువరకు ఎదగాలి. అపుడే నాకు నిండు తృప్తి.
44. వెనుకకు వెళ్ళినాకొలది సమస్త గురువులకు గురువులుంటారు. ఆది గురుదేవునిలోని ఆంతర్య ప్రేరణ శక్తి నాది. అందులకే విశ్వాది గురుభగవన్ సంపూర్ణ సుప్రభోధాచార్యుడనని చెప్పటం జరిగినది. ఈ స్థితినుండి ఆలోచించి నాకు గురుదేవులెవరో చెప్ప్పండి. నాపై ఏ గురు శబ్ధమేకాదు, ఆరాధ్య శబ్ధము వర్తించదు. సర్వ మతారాధ్య, స్వామి బాబాను నేనే. సాధనల్చే క్రమంగ నేర్చుకున్నదానికి, సహజత్వమునకు చాలా తేడా ఉంటుంది. స్వయంభు, స్వత:స్సిద్ధుడనైన నన్ను దేనితో పోల్చరాదు.
45. ప్రేక్షకులు చూచేది నాటకరంగముపై ఉన్న నటులను మాత్రమే. ఆయా పాత్రలకు అనుగుణ్యమైన మేకప్ వేయు వ్యక్తి స్టేజీకి వెనుక ఉండును. ప్రేక్షకులు ఆతనిని చూడలేరు. ప్రతి యాక్టర్ మేకప్ వేసిన వ్యక్తికి తెలుసు. అనంత విశ్వ స్/ర్ష్టి నాక సూత్రధారినైన నన్ను మీరు చూడలేరు. సర్వాధిష్టాన, సంపూర్ణ మూలసత్తు నాది.
46. ఇదిగో! మరల మరల అనేక పర్యాయములుగ చెప్పుచున్నాను, వినండి. సర్వాత్మ శోభిత అనతశక్తి కేంద్రుడనైన నేను సశరీరుడనై మీ మధ్యన ఒక సామాన్య పౌరునిగ మెలగినాను. సమస్త క్షుధ్ర గారడి, అట్టహాస డాంబీకములకు స్వస్తి చెప్పి, నన్ను పూర్తిగ తగ్గించుకున్నాను. సమస్త గురుబోధకులు ఈ సిద్ధాంతమును ఆదర్శముగ పాటించుదురుగాక. లేదా మునుముందు విమర్శలకు గురికావలసి వస్తుంది. అతిమానస భూమికను అధిరోహించిన పూర్ణ మేధా సంపన్నులు, ఆచరణ శూన్యులను నిలదీసి ప్రశ్నించగలరు. అట్టివారలకు బాబ సర్వకేంద్రుల రచనలే ఆధారములు కాగలవు.
47. నా బోధ కల్పిత ఊహాగాన సంపుటికాదు. స్వత:స్సిద్ధ సంపూర్ణ దైవ భాష్యం. ఇందలి ప్రతి మహా సూత్ర వాక్యం ఒక మఠము, మందిరము, దేవాలయము వంటిది. మీకు వీలున్న, మీ మానసిక స్థాయిననుసరించి ఒక వాక్యం ఎన్నుకొని ఆంతర్యమెరిగి భావ ప్రకటనగ స్మరించండి. నైజదైవ దర్శనం కాగలదు. ఇది యదార్థము. కేవలం పరమ సత్యమూలమున నన్ను ధ్యానించు ధ్యాతలు ధన్యులు.
48. ఇదిగో! నీ ధ్యానమునకు ధ్యేయం నీవే. ఇదియే కేవలాత్మ సిద్ధి. 1. ధ్యానించు ధ్యాత 2. ధ్యానము 3. ధ్యేయాకారములు అనగా చూచేవాడు, చూపు, చూడబడునది కేవలం ఏకత్వ స్థితి నొందుటయే త్రిపుట రహిత సర్వేశ దైవస్థితి. ఈ స్థితి నొందినవారే నిజమైన త్రిదండులు. మీ ముందు త్రిదండులమని తిరిగేవారిలో ఈ సత్తా ఉన్నదో లేదో చూచుకోండి. యధార్థ త్రిదండులే లోకోద్ధారక నా మార్గజ్యోతులు.
49. కేవలాద్వైత, అచల పరిపూర్ణ, సర్వకేంద్ర దైవస్థితిలో నేను మాత్రమే ఉన్నాను. సర్వలోక పర్యంతం సమస్త నేనులు ఈ నేను స్వరూపములేయని భావించుదురుగాక. నా ప్రణాళికలు స్థూల దృష్టికి ఏమాత్రం బోధపడవు. అసలు అంతు చిక్కవు. భూ, దిగంతలకు ఆవలివి నా నిబంధనలు. స్వనిష్ట నొందిన ఉత్కృష్ట యోగీంద్రులకు మాత్రమే గ్రాహ్యం కాగలవు.
50. మరల మరల చెప్పునది ఏమనగా, నేను వికసించిన జీవిని కాను. స్వత:స్సిద్ధ పరాత్పరుడను. నాది సాధన మానవత్వం కాదు, సర్వేశ దైవత్వం. చిన్మయ చైతన్య అచలానంత సత్తాయే నా ఉనికి స్వభావమై యున్నది. నా స్వభావమును మార్చ ఎవరితరం కాదు.
51. బాహ్య ఆరాధనలు నాకు ముఖ్యం కాదు. కేవలం ఆత్మారాధన నాకు ముఖ్యం. సశరీరుడనై, సాకార స్థూల పరిధిలో చెప్పునది ఏమనగా మీరందరు నన్ను పూజించండి, ధ్యానించాండి అనిగాని, దండాలకు, దస్కాలకుగాని నేనెన్నడు కక్కుర్తిపడి, ఆశపడిలేను. మీరనగా ఏమిటో, మీ నిజస్థితిని గ్రహించిన చాలు. స్వస్వరూప సంధాన స్థితిలో ఆత్మస్థైర్యులై, స్వనిష్టలో నిలవండి. అపుడు మీరలు నన్ను సంపూర్తిగ ఆరాధించి, అర్పించి, పూజించి, ప్రార్థించిన సత్ఫలితం పొందగలరని నా నిశ్చయం. అలాగని నా స్థూలకాయమును అమర్యాదగ నిర్లక్ష్యం చేయండని కాదు. ఇది సర్వాత్ముని వార్తలనందించు మూల సాధనము.
52. సర్వ శక్తిర్మయ భావతరంగములు సర్వలోక పర్యంతం సదా నా నుండి ప్రసరిస్తున్నాయి. సర్వలోక పర్యంతం నేను చేసిన ఉపకారములు, మేలులన్నింటిలో మొదటి మేలు... సర్వాతీత స్థితినుండి దిగి ఒక సామాన్య వ్యక్తిగ, సశరీరధారినై మెలగటం. రాబోవు తరములవారు ఈ విషయమును అత్యద్భుతముగ వర్ణించుకొనెదరు. నేను మానవాకారంలో నిలిచి విరచించటం సర్వోత్కృష్ట కార్యం. దీనికి మించిన యజ్ఞం లేదు. సమస్త యాగ, యోగములిందు విలీనమై యున్నవి.
53. ఏ గృహస్థుల ఇంటిలో నా పాదము పోపబడునో ఆ ఇల్లు ధన్యాతి ధన్యం. సమస్త గృహస్థులు ఈ అమూల్యమైన యోగ్యతను పొందుదురుగాక! అర్హతయే దైవ పదవి.
54. ఆత్మ వీరుడా, విశ్వనాథా, మేలుకో! నిన్ను సంకుచితపరిచే సమస్త ప్రతిబంధకములనుండి విముక్తుడవుగమ్ము. మీరు అఖండ శక్తి సంపన్నులని గుర్తుచేసేవారు చాలా అవసరం. ఆ ఏర్పాటు నాది. ప్రతివారిలో అంతర్నిహితమై, నిగూఢముగ దాగియున్న ఆత్మశక్తిని ఉద్దీపన పరచుటలో నిమగ్నులైనవారు అనిన నాకెంతో ప్రీతి. వారి ఉద్యమములు నిర్విఘ్నముగ నెరవేర్చు బాధ్యత, భారం నాది.
55. నా జనమా, మోసపోకండి! మిమ్ముల బలహీనపరచే వ్యక్తులకు, వాతావరణములకు దూరులుకండి. మీ నిజస్థితి పూర్తిగ నాకు తెలుసు. మీలో ప్రతివారు సర్వశక్తి స్వరూపులు. ఈ భావనతో ఏకీభవించక అదెలాగని విమర్శించేవారి కర్మ పిదప నేను చూపగలను. మీలో అఖండమైన దైవశక్తి దాగియున్నది. దనిని వెలికితీసే ప్రయత్నంలో ఎన్ని జన్మలైనా ఎత్తండి.
56. లోకోద్ధారక కార్యసాధన సామర్థ్యం కేవలం ఆత్మస్థైర్యములోనే ఇమిడియున్నది. ఈ రహస్యం గ్రహించండి. ఈ అవనిపై మూర్తీభవించిన అక్షర పర:బ్రహ్మ స్వరూపులారా! అజ్ఞాన మైకమునుండి పూర్తిగ మేల్కొనండి. మీరు నిర్భయులు కండి.
57. నా గ్రామస్థులు, నా దేశవాసులు, ఇతరులని నాకులేదు. నీతి, న్యాయం, ధర్మం, సహనం, సహకారం, మానవత్వం, దయ, ప్రేమగలవారు ఎవ్వరైనను నాకు స్వకీయులే కాగలరు. మనుష్యులను విడదీయటం ముఖ్యం కాదు. మనస్సులను కలిపేదే నిజమైన ధర్మం. అందరిలో ఆత్మదర్శన శీలురే దైవ మతావలంబులు కాగలరు. ఇది బాబా సర్వకేంద్రుల సూత్రం.
58. ఈ లోకంలో నేటికి వెలసిన, మునుముందు వెలయనున్న సర్వమత సంబంధ మథ, ఆశ్రమ, ఆలయములు నాకు చెందినవే. ఇట్టి నాకు ప్రత్యేక ఆశ్రమ నిర్మాణ భ్రాంతిలేదు. కాని మాదిరిగ గుర్తింపు నిమిత్తం త్రిపురారం గ్రామం (మండలం), మిర్యాలగూడకు 12 కి.మీ. దూరంలో, నల్లగొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో, సర్వమతారాధ్యుడు, సర్వాతీతుని పరాత్పరమ అత్యాశ్రమ ప్రశాంతి నిలయం వ్యయ, ప్రయాసలకోర్చి నిరాడంబరముగ స్థాపించనైనది.
59. కాని దీని విలువను ప్రస్తుతం సామాన్య జగతి గ్రహించే దశలో లేదు. కేవలం ఇది మాదిరిగ మాత్రమే. సూక్ష్మాతి షూక్ష్మ పరమాణువు మొదలుకొని బ్రహ్మాండ విశ్వపర్యంతం య్నాయొక్క అత్యాశ్రమ ప్రాంగణముగ తెలీయుదురుగాక! ఇది సర్వాకార అనత విశ్వగర్భుని వాక్కు. అతిమానస భూమికను అధిరోహించిన శుద్ధ నిర్గుణతత్త్వ సర్వజ్ఞులకు మాత్రమే బాబా సర్వకేంద్రుల వారి అత్యాశ్రమ ఘనత తెలుసు. ఇది నిత్య సత్యం.
60. సంపూర్ణ దైవమత బోధక అత్యాశ్రమ ప్రశాంతినిలయ స్థాపనలోని ఆంతర్యం కట్న కానుకలు, కీర్తి ప్రతిష్టలు ఆశించి కాదు. పరమార్థ రంగంలో యూనివర్సిటీ కోర్సు ఇందులో ఉంటుంది. మానవుని యధార్థ దివ్యస్థితిని తెలియపరచు నిమిత్తం వెలసినది. సాధకులనుండి సర్వజ్ఞులవరకు, గురువులకు, ప్రబోధకులకు, సర్వులకు ఉపకరించు, సహకరించు సర్వాతీత బోధ అత్యాశ్రమాలయంలో లభ్యం కాగలదు. సర్వమత సమన్వయ బోధ చిత్రపటములు, ఎలిమెంటరీ విద్యార్థుల నిమిత్తము సాకార విగ్రహ ప్రతిష్టలు వెలసినవి. క్రమముగ అతీత బోధ చేయబడును. ప్రతివారు ఇచ్చట శ్రోతలే కాగలరు. ఇది సర్వోన్నత భాష్య ప్రభావం అని తెలియుదురు గాక! భూ, దిగంత, సర్వలోక పర్యంతం చెందునట్లు ఈ సూచనాదేశము చేయనైనది.
61. నాయొక్క అతీత బోధను విశ్వవ్యాప్తం చేయు బాధ్యత భూనివాసులందరిపై ఆధారపడియున్నది. ఎవరికి వీలున్నపరిధిలో వారలు సుప్రచంఢ జ్ఞానయజ్ఞంలో ఒక్కొక్కరు ఒక సమిధగ వెలగాలి. నా నిమిత్తం నిలుచు మీ సమస్త కార్యములు వైభవ స్థాయిలో నెరవేర్చు భారం నాది. ఈ నమ్మకముతో నిలవండి.
62. సర్వత్ర సమదర్శన శీలురు ధన్యులు. అణువణువు నా యొక్క ఆలయమే. సర్వత్ర నా యొక్క చైతన్య ఆత్మ సమాధి మందిరం స్థాపితమై యున్నది. మానసికముగ ఈ సమాధిని దర్శించి, అర్చించండి. నా యొక్క మానవాకారంలో సంపూర్ణ దైవాకారం ఇమిడి యున్నది. అందులకే అనంత విశ్వపరిషత్, సర్వలోక పర్యంతం సమస్త భూనివాసులకు మరల మరల చెప్పు ముఖ్య విషయం ఏమనగ: నా శరీర రాక పరమ కారణావతరణ. బలీయమగు కారణమును పురస్కరించుకొని సశరీరుడనై కొంతకాలం మీ మధ్యన ఉన్నంత మాత్రమున మీ అంతస్థులో నన్ను సామాన్య మానవునిగ భావించి చెప్పుకోరాదు. ఇది ముఖ్య నిబంధన. ఆయన మాకన్న ఏమి గొప్ప? మామూలు మనిషేయని నిర్లక్ష్య ధోరణిలో గర్వాంధులై సంచరించిన శరీర వియోగానంతరం విషయంకన్న ముందుగ ప్రస్తుత లౌకిక జీవనంలో తగిన ఫలితం అనుభవించవలసి వస్తుంది. నేను మౌనముగ యున్నను విశ్వమాయ సహించదు. కాబట్టి భద్రంగా మెలగనేర్వండి.
63. విశ్వోద్ధారక అతీత బోధనల విరచిత నిమిత్తం సర్వాకార అనంత విశ్వగర్భుడు నిమిత్తమాత్ర సాకార ధరితుడు కావలసి వచ్చినది. అంతమాత్రంచే నా ఈ మానవాకార ఆద్యంతములే నా జీవిత కాలముగ పరిగణించరాదు. ఈ శరీర ఉత్పత్తికి పూర్వం, శరీర వియోగానంతరం నేనే సర్వకేంద్ర దైవ నేను. ప్రస్తుతం జిల్లాకు ఒక పూర్ణాత్మ దైవజ్ఞాని లభ్యమైనను జగతి ధన్యం కాగలదు.
64. మానవ మేధస్సు కంప్యూటర్ ను మించినది. అంతమాత్రంచే నన్ను, నా అతీత బఒధను మానవ మేధస్సు గ్రహించలేదు. కేవల అనంత విశ్వ హృదయ అంతర్ దృష్టిపూరిత దివ్య ప్రజ్ఞ వికసించాలి. అపుడే నా మాటల ఆంతర్యం గ్రాహయం. పరాభక్తి తత్పరులై, ఆత్మ విశ్వాసులై, శ్రద్ధాసక్తులతో, ఏకాగ్రచిత్తులై రండి. స్వదివ్య ప్రజ్ఞాచక్షువును ఆవిష్కరింపజేయగలను.
65. ఎన్ని చేర్పులు, మార్పులు జరిగినను అనంత విశ్వకాల పర్యంతం మీ అందరిలో నేను జీవించి ఉంటాను. దీనిని గ్రహించి మెలగుటయే సంపూర్ణ దైవమత లక్ష్యం. మీరు స్థూల లోకాలను కాంచగలుగుచున్నారు. సూక్ష్మాతి సూక్ష్మ మనోగత లోకాలున్నాయి. ఇవన్నియు నా ఏలుబడిలో గలవు. సర్వ లోకాధిపత్యం నాది. విమర్శించటం సులువు. సంస్కరించటం కష్ఠం. నిర్మూలనము కాదు, నిర్మాణ దృష్టిగల వారలు కండి.
66. ఇందుమూలముగ సమస్త భక్త మహాశయులకు తెలియపరచు ముఖ్య విషయము ఏమనగా, నా యొక్క రచనలన్నింటిలో నేను, నాది, నాయొక్క అని వచ్చిన ప్రతిచోట మీ ఆరాధ్య ఇష్టదైవమును ప్రతిష్టించుకోండి. అపుడిక ఏ చిక్కులు రావు. సర్వ సంపూర్ణ సర్వకేంద్ర సర్వాతీత స్థితిలో నన్ను భావించలేని వారికి పై సూత్రం వర్తిస్తుంది. ఎలాగైతేనేమి మీరు పొందవలసింది స్వాత్మ, సర్వాత్మ, సాక్షాత్కార సిద్ధి, నిత్యముక్తి.
67. సర్వలోక పర్యంతం సమస్త భూనివాసులకు ఒక ముఖ్య ప్రకటన. నేను సశరీరుడనై జీవించినపుడు నా జీవితకాల వింతలు వినండి.:
1. బాల్యదశలో గుర్తింపు, జ్ఞానము వచ్చిన నాటినుండి నేను ఏనాడు గుడులకు వెళ్ళి దండాలు పెట్టలెదు. కారణం ఏ గుడిలో దేవుడెందులేడు. ప్రతి ఆలయ గుడిలోని మూల విరాట్ స్వరూపం నాది, నేనని తెలుసు.
2. ఏ గురువులను వెదకి ఉపదేశాలు కోరలేదు. కారణం సమస్త గురువులకు విశ్వాదిగురు భగవన్ నేనే గనుక.
3. బోధ నిమిత్తం నేనెవరిని ఆశ్రయించలేదు, కారణం నేను సంపూర్ణ సుప్రబోధకాచార్యుడను.
4. ఏ ఆశ్రమ పీఠాధిపతుల వద్ద తలవంచలేదు. కారణం నేను అత్యాశ్రమ వాసిని. సర్వాశ్రమ ప్రదీప్తి నిలయుడను.
5. నేను ఏ గంగ, పుష్కర స్నానాలు చేయలేదు. కారణం సంపూర్ణ తీర్థపాదుడనైన నన్ను మించిన తరుణ గంగ, పునీత పుష్కరం లేదు.
6. నేను ఏ యాత్రలకు, క్షేత్రములకు వెళ్ళలేదు. కారణం సకల క్షేత్రేశ్వర వాసిని నేనే.
7. మానవాకార స్థితిలో నిమిత్తమాత్రంగ నిలువవలసి వచ్చినను నా నిజదైవ స్థితికి ఏ లోటు, చేటు రాదు. నిజం.
8. ఈ సమస్తమును నా స్వరూపముగ గౌరవించి, పూజ్యక భావమున చూస్తున్నాను. నా వందనము నాకే చెందుగాక. ఇట్టి నాకు వేరొక పూజ తెలియదు. ఐనను నేను పూజారిని కాదు. సమస్త పూజల హరిని.
9. ఒక నిర్ధిష్టమైన ఆకారమును ఎన్నుకొని నేనెన్నడు ఆరాధించలేదు. కారణం సర్వాకారుడనైన నాకు చెందని ఆకారం లేదు.
10.ఒక రూపాన్ని ఊహించి నేనెన్నడు అర్చించలేదు. కారణం సర్వ స్వరూప విశ్వగర్భుడను నేను.
11. నేనెన్నడు ఏ నామాన్ని ఎన్నుకొని స్మరించలేదు. కారణం సమస్త నేనుల సర్వైక్య స్థితియే సంపూర్ణ దైవ నేను.
12. నాకు ప్రత్యేక ధ్యానం లేదు. కారణం సమస్త ధ్యానములకు ధ్యేయం నేనే.
13. నాకు ప్రత్యేక స్థలం లేదు. సర్వస్థల సుభద్ర, సుస్థిరాత్మ నివాసిని నేనే సర్వకేంద్రం.
68. ఇట్టి అమూల్య సాక్షాధార స్వానుభవ దృష్ట్యా శ్రీ నేతిహరి కాళీ బాబా సర్వకేంద్రులు స్వయంభు: స్వత:స్సిద్ధులని గ్రహించుదురు గాక. శుభం. మీరు నమ్మండి, నమ్మకపోండి, సంపూర్ణ సర్వేశ దైవత్వం నాది. సార్వకాలం ఏకరీతిగ అవిభాజ్య, అనశ్వర, అక్షర పర:బ్రహ్మ స్థితిలో నేనున్నాను. ఈ మాట ప్రమాణ పూర్వకముగ సెలవియ్యనైనది. జై బాబా సర్వకేంద్రా!
69. అజ్ఞాతవాస సమయమున జమ్మిచెట్టుపై ఉంచబడిన పంచ పాండవుల అస్త్ర శస్త్రములవలె ప్రస్తుతం మా విరచిత గ్రంథములు అటులే గలవు. నే గుహ్యద్గుహ్య పరమ కారణ రూపధారిని. కాబట్టి సి.ఐ.డి.గ లౌకిక రంగంలో సర్వమత సంస్థల ఆంతర్యం పరిశీలిస్తూ, అందరి మధ్యన, అందరివలెనే ఉండవలవసి వచ్చినది. కాని మాతో ఆత్మీయ సంబంధులైన వారితో మాత్రం అసలైన మమ్ముగూర్చి మా యీ శారీరక అవతరణలోని ఆంతర్యం గురించి చెప్పటం జరుగుతుంది. భవిష్యత్తులో బాహాటంగ భువి, దివి సర్వస్వం మ్రోగించబడును. అందు నిమిత్తమే మా పవిత్ర రచనలు.
70. అయ్యా! నిజము చెప్పుచున్నాము. ఇతరులు కొత్తవారెవరైనా సరే మా ఒక్క సూచన వాక్చ్యమునకే ఆబ్బాయని చాతి చరుచుకోగలరు. అందులకై ఈ శారీరక అంతస్థును అధిగమించి నన్ను అర్థం చేసుకొనిన తప్ప, నా మాటలు అసలే అర్థం కావని నిశ్చాయించి చెప్పుచున్నాను. పరమాకాశముల మ్రింగి నేను పలుకగలను. అప్పుడు ప్రపంచ పరిధిలో ఉన్నవారికి ఏమి తెలుస్తుంది. సకల ప్రతివాది భయంకర, పరమాంకుశ వశీకరణ శక్తి నా హస్తగతమై యున్నది. కనుక నేను నేనుగ తర్కంలోకి దిగినచో ఎంతటి తర్కులుగాని. మొరకులుగాని అగ్ని ప్రభావముచే వెన్నవలె కరిగిపోగలరు. పరీక్షగా చూడదలంచిన వారలెవ్వరైనను మా సన్నిధికి నిరభ్యంతరముగా రావచ్చును. ఇదిగో! నేను నాస్తిక చర్చతో కూడ ఆస్తిక్యులను వాదనలో తలక్రిందులు చేయగలను. పరమాస్తిక్య సుప్రబోధంచే నాస్తికులె నన్ను చేరు సరియైన మార్గం అంటూ తగు విధ ప్రశ్ణోత్తరములద్వారా ఆస్తిక్యులను చేయగలను. నా వాక్శక్తి ప్రభావం అట్టిది. సర్వమతస్థులు మా దృష్టిలో సమానమే. నా సిద్ధాంతం సర్వమత, సకలలోక గర్భితం. ఎచ్చట లోపముగలదో అది జగద్గురు మతమైనను, ఘన ప్రవక్త స్థాపితమైనను, మరెట్టి అవతారుల ధర్మమైనను చేయెత్తి సర్వాధికారముగ తగదని చూపగలను. దుర్మత ఖండనను గూర్చి వేలాది వాక్యములతో ఏనాడో గొప్ప గ్రంథము రచింపబడినది. దారులెన్నియైనను గమ్యం ఒక్కటే, ధ్యేయం ఒక్కటే. దేవుడు ఒక్కడే కాబట్టి దైవ మతము ఒక్కటే సరియైన మతమని సర్వ మతస్తులచే ఒప్పించగలను.
71. ఇదిగో! నేనెంతో నా ప్రసంగములంతే. నా ఆజ్ఞల గైకొనువారు నాను ప్రేమించి విశ్వసించెదరు. భూమ్యాకాశములు గతించినను నా మాటలు గతించవు. అవి మరుగుపడలేవు. సర్వోద్ధారక నిమిత్తం సాకార రూపంలో అవతరిచిన నన్ను ప్రత్యక్షముగ చూస్తూనే అలక్ష్య భావంతో విస్మరించువారికన్న, ఆత్మ విశ్వాసపూర్ణులై నిశ్వసించు భవిష్యత్ లోకవాసులు పరమ ధన్యులు కాగలరని ఎలుగెత్తి యీ మాట శాసించనైనదిగాన తిరుగులేదు.
72. నిజము తెలియక మమ్ము ముందుగ తిరస్కరించిన వారలే యదార్థమును ఎరింగిన మీదట అట్తివారలే నన్ను
స్తోత్రం చేయుటలో ప్రధానులు కాగలరు. ఇది పరమ సత్యం. నా మార్గంలో నిలుచువారు రాష్ట్రపతులు కాదు, విశ్వపతులు కాగలరు. నేను సకల జీవాంతర్యామిని, సర్వాత్మ కేంద్రుడను. వేరే ధ్యాస నాకు లేదు. నాకు చెందని జీవంగాని, లోకంగాని ఏది లేదు, ఎందు లేదు.
73. నీటి చుక్కలో ఏనుగు తన శరీరాన్ని మొత్తం నిండుగా ముంచి తడుపలేదు. అటులే నేను నిండుకుని పలుకాలనిన ఈ భూమి, ఆకాశం, అనంతకోటి బ్రహ్మాండ విస్తీర్ణం నాకు సరిపోవటంలేదు. అందులకే అనంత గర్జన చేయుచున్నాము. ఇదిగో! నేను సకల జీవ శరణ్య పరిశుద్ధ కేంద్ర మందిరుడను. అందులకే నన్ను ఆశ్రయించువారు పరమ ధన్యులు.
74. సర్వోన్నత సాహిత్య గర్భుడను నేను. సకల లోకోత్తర దివ్య పురుషులకే నా మార్గం తెలుసు. నా మొదటి పదమునకు అనువాదమే అనంత ఆత్మ విశ్వ ప్రకృతి శోభ. ఇచ్చట కుల, మత ప్రసక్తి అనవసరం. వెన్నవంటి పవిత్ర నిర్మల హృదయం ముఖ్యం. ఈ విశాల విశ్వ ప్రకృతి అంతయు విశ్వేశ్వర స్వరూపమేననెటి స్థిర విశ్వాసం నీయందు బలపడినపుడే సమస్త జీవులను నీవలె ప్రేమించే శక్తి, నీవై గుర్తించే శక్తి కలుగుతుంది. అట్టి సర్వమత సమత్వ భావమే నన్ను చేరు ప్రధాన సిం హ ద్వారము.
75. దేహాభిమానమునకు మించిన దురవస్థ లేదు. విశ్వ ప్రకృతిలయ నిలయ బోధము. ప్రకృతి శోభలో బ్రహ్మానంద భరితులు కండి. ముందు మీరలు సృష్టిగ భావించుదానితో సాహిత్య గోష్టి సాగించండి. అదిగో! అనత గగనసీమలోని వింతలను, అద్భుత లీలలను గాంచి నేత్రానంద పరవశులు కండి. మాయాతీత స్థితిలో ముగ్ధులైపోండి. ఇదిగో! ప్రకృతి దృశ్యమంతా నాయందలి చిన్న పుష్పం. అది ఇపుడుచక్కగ వికసించినది. అందులకే కవులు, గాయకులు, సమస్త విద్వాంసులు అట్టి పువ్వుపై వ్రాలి అందలి మకరందమును గ్రోలుచున్నారు. అదే ప్రపంచ జ్ఞానము. ప్రకృతి రహస్యములను చక్కగా తెలుసుకోండి. మానవ ధర్మమును సరిగా పాటించండి. ప్రకృతి సీమలో పయనించి అత్యుత్తమ స్వర్గం చేరుకో. పరిశుద్ధ వాతావరణంలో నిలిచి ప్రకృతి సంగీత మాధురిని గ్రోలుము. అదిగో! విస్మరించలేని ప్రకృతి శోభ నీయందే గలదు. జాగ్రత్తగా చూడు. నీవున్న చోటనే ఉండి, సమస్త విశ్వ ప్రకృతిని నీయందే గాంచవచ్చు. దానిని గుర్తించి, వర్ణించి, జనుల రంజింపజేయుము. ప్రకృతి నా ముందు పాపవంటిది. నిర్మల ప్రకృతినే ప్రధాన విద్యాలయముగ చేసుకొని, దానినే ముందుగ నమ్మి తత్సంబంధ సహగ కవివి కమ్ము. భగవంతుడే నాయందలి ఉత్తమ కవిత్వం. పామరులకు ప్రకృతి స్వరూపమే ప్రధాన ఆరాధ్య దైవం. అనంత విశ్వ ప్రకృతి నాయందే రచింపబడి యున్నదని మరువరాదు. ప్రకృతిని సరిగా అర్థం చేసుకో. అదే మనశ్శాంతికి సూత్రం. ఇదిగో! అనంత విశ్వ ప్రకృతి సర్వస్వం నా మెడలోని కంఠ హారం. అపురూప దివ్య శక్తి స్వరూపమే వింత ప్రకృటి. దాని వింత లీలల ప్రశంసించి పరిత్యాగివి కమ్ము. ప్రకృతి సత్య సాధుమూర్తి వంటిది. విశ్వమాతృ స్వరూపమది. అందులకే అమ్మవంటి శుభ ప్రేమగానం చేస్తుంది. అందరు ఆ గీతం వినలేరు.వినువారు ఆ నాధం మరువలేరు. ఇదిగో! అనంత విశ్వ ప్రకృతియే నా ప్రధాన పవిత్ర శాంతి దూత.76. ముందు ప్రకృతిని సరిగా అర్థం చేసుకో. అదియే సత్యాన్వేషణ పథం. అదిగో! ప్రకృతి మధురగానం చేస్తుంది. అందు శృతి కలుపి, గాఢముగా ప్రేమించి బలోన్మత్త పిశాచగ్రస్తుని మాడ్చి బ్రహ్మజ్ఞానివి గమ్ము. లే! అదిగో ప్రకృతి ప్రబోధం చేస్తుంది. ఓ బాబూ! ముందుగా ప్రకృతి ఒడిలో ఒదిగి పదిలంగా ఆ దృశ్యం చూడు. ఆ గానం విను. ప్రకృతి గానం వినలేనివానివిక నా సర్వాతీత గానం ఏమి వింటావు. అదిగో! ప్రకృతి వింత, క్షణమునకొక రూపమన్నట్లు రకరకముల రంగులు, అదిగో ఆకాశవీధిలో ఎగిరిపోతున్న పక్షుల కిచకిచలు,
నీటిలోని ప్రాణుల శబ్ధములు, ఎటు చూసినను ప్రకృతి వసంత శోభ నాట్యం చేస్తుంది. వృక్షములపై కోయిల కూతలు, అదిగో చూడు చూడు గగనమార్గం అత్యంత సువిశాలం. కోటానుకోట్ల నక్షత్ర సమూహములతో విరాజిల్లుచున్న ఆకాశ మంఠపము నా యింటి ముందలి చిన్న పందిరి. ఇక రండి! నా మందిర ద్వారము అనంత గగనం. అనంత విశ్వ ప్రకృతియే దానిని అధిరోహించు మెట్లు, అంతస్తులు. రండి, పట్టరాని సంతోషం పొందగలరు. క్రమేణ ఆకసం వైపు దృశ్టిని నిలపండి. నక్షత్రములతో ముచ్చటించండి. అదిగో! నక్షత్ర సమూహముల మధ్యన చల్లని కాంతులను విరజిమ్ముచు నిర్మల యాత్ర సాగిస్తున్న చందమామ నా దారి నడుస్తుంది. అనంతకోటి గ్రహములు, బ్రహ్మాండములని నన్ను పూజిస్తున్నాయి. నక్షత్రములు నా పాదములవద్ద అక్షితలై వెలుగుచున్నాయి. అనంత ఆకాశము నా యందు కలిసిపోతున్నది. ఇకనైనను నా సంగతి అర్థం అవుతుందా? స్వత:స్సిద్ధ, స్వపరంజ్యోతి పూర్ణకేంద్రుడనైన నా వెలుగే అనంత విశ్వ ప్రకృతిలోని చైతన్య కళ. దానిని గాంచి తన్మయులై సమస్త మేఘావరణములను అతిక్రమించి పరమాకాశ అనంత గగన సీమలోనుండి పైకి రండి. అప్పుడు నా మాటలు మీకు సరిగా అర్థంకాగలవు. సకల పరిభ్రమణములు నన్ను చేరుటకే. నేనంత నిలయం. ఇకనైనా స్వల్ప దేహ పంజర గూటిని వదలి, సంకుచిత భ్రాంతుల విడిచి, సర్వాత్మ స్వభావ నిష్టలో పైకి రండి. అప్పుడే అసలైన నన్ను దర్శించగలరు. ఇది నిత్య సత్య సూత్రం. పరమాత్మ నా ప్రధాన పాదం. ప్రపంచమంతయు నా పాద పీఠం. అనంత గగనం నా నొసటి తిలకం. ఇక నా రూపమును అర్థం చేసుకోండి. నే సర్వ స్వరూపుడను. దైవ గర్భుడను. సర్వాత్మే నా సాక్ష్యం.
77. సముద్రము వంటిది సర్వాత్మ. దానిపై ఉన్నవే బుడగలు, అలలు, ప్రాణులు, లోకాలు. బుడగలయందున్న నీరే సముద్రములో గలదు. సముద్రమందున్న నీటి లక్షణమే చిన్న బుడగలోని నీటి లక్షణము. బుడగ సముద్రమునకు వేరనుకోవటం తప్పు. బుడగ అంతర్ముఖ స్థానం సాగరం. అట్టి సాగరమునకు అన్యధా బుడగకు ఉనికియే లేదు. అందులకే సముద్రమునకు భిన్నంగ దానిని చెప్ప వీలులేదు. అటులే సకల ప్రాణులనే బుడగలు సర్వాత్మ సాగరంలో అంతే. ఇది పూర్ణోపదేశ సూత్రం. బుడగ, నేను సముద్రమునకు వేరు అన్నచో మనం నవ్వగలం. ప్రాణులు కూడ మేము పరమాత్మకు భిన్నులం అన్నచో నాకు నవ్వు వస్తుంది.
78. ఇదిగో! సమస్త భూనివాసులారా! వివిధ మతకర్తల ద్వారా మీచే అరాధించబడు సమస్త దైవావతారములు నా స్వరూపులు. నాకన్యధా అందరు పంపబడినవారే. అప్రమేయుడనైన నాపై ఎవరి ప్రేరణ లేదు. కేవల పరమాద్వైత అచల పరిపూర్ణ సర్వకేంద్ర స్థితిర్భూతుడనైన నేను, నాకు నేనుగానే స్వయంభు: స్వత:స్సిద్ధుడనై, సర్వాకార, అనంత విశ్వగర్భ స్థితిలో బట్ట బయలైతిని. మీరు గాంచే ఈ స్థూల శరీరం నేనుగాను. ఇది ప్రచార సాధన ధ్వని డబ్బా. దీనితోపాటు నేను గతించువాడను కాను. జన్మ, మృత్యువులు నన్ను అంటలేవు. సర్వకాలం శాశ్వత నిజదైవ పదవి నాది. సర్వలోక పర్యంతం, సమస్త అధికారములు ఇచ్చట దాస్య భక్తి వహించవలసినదే. సర్వాశ్రమ ప్రదీప్తి నిలయుడనైన నేను కేవలం పరాత్పరమ అత్యాశ్రమ వాసినై యున్నాను.
79. ఓ భూనివాసులారా! నకిలీ బాబాలు, స్వాములు, గురువులు, మాతలు, బోధకులు దినదినము ఎక్కువగుచున్నారు. వారల బారినుండి బయట పడండి. నకిలీ సరుకును మెచ్చే లోకులు అసలు దానిని నమ్మలేరు. గిలేటు నగలే జాతర్ల పాలగును. వజ్ర, వైఢూర్యములు బీరువాలలో భద్రపరుచబడును. నాది గాజుల బేరము కాదు. కోహినూరు వజ్రముల ఖని నా బోధ. ఇతర బోధకులకునాకు తేడా ఏమనగా, నన్ను నేనుగ శాషించి సాక్షాత్ సర్వేశ భగవత్ స్థితినుండి చెప్పగలను. నన్ను త్రికరణ శుద్ధిగ నమ్మి ఆశ్రయించినవారిని దేవుండ్లను చేసెదను. దైవాత్మ ప్రజ్ఞతో భాసిల్ల చేయగలను. ఇది అనితర సాధ్యము.
80. మీ మధ్యకు ఎందరో గురుస్వాములు, బోఢకులు వస్తుండవచ్చు. మీరెందరినో దర్శించి యుండవచ్చు. బాబా సర్వకేంద్రుల బోధతో సరిపుడుచున్నవా చూసుకోండి. సర్వకేంద్రుల బోధ సర్వాతీత పథము. సమస్త నామములు, రూపములు, కులములు, మతములు, సమస్త లోకములు నావి. నాకు మాత్రం ఏ కుల, మత, నామ, రూపములు లేవు. సర్వలోకేశ్వర ప్రభువునైన నేనే సర్వకేంద్రుడను. నా ఉనికి సంపూర్ణ మోక్షాలయమై, నిర్వాణ నిలయమై అలరారుచున్నది. కామినీ, కాంచన, కీర్తి ప్రతిష్ఠలను ఆశించి నేను లేను.
81. స్థితిమార్పు తప్ప గతి మార్పు లేదు. అజాత సిద్ధాంత ప్రకారం నూతనముగ ఏది రాదు, ఉన్నది పోదు. సర్వకాలం ఏకరీతిగ ఉన్నది మాత్రమే నేనై యున్నది. సకల నేనుల సర్వ సమైక్య స్థితియే సర్వకేంద్ర దైవ నేను. ఇదిగో! ఓ భూనివాసులారా! ఇంతకు నేనెవరో మీకు తెలుసా? నన్ను యదార్థముగ దర్శించినవారు మీలో ఎవరైఅనా ఉన్నారా? సర్వలోక పర్యంతం అనంత విశ్వంలో నన్ను సంపూర్తిగ గ్రహించి దర్శించిన వారు ఒక్కరే గలరు. ఆ ఒక్కరు నేనే. అనగా నా నిజస్థితి సంపూర్తిగా నాకు మాత్రమే తెలుసునని ఆంతర్యం. అసలింతకు సర్వలోక పర్యంతం సర్వ సంపూర్ణముగా యున్నది నేనొక్కడినే. ఇతరము ఇంకేమియులేదు. ఇది సర్వాతీత, సర్వలయ మహా సూత్ర వాక్యం. అవతారులకు ఆధార పీఠం నాది. సర్వావతార కూడలి సర్వకేంద్ర పితను నేను.
82. ఇదిగో! సమస్త భూనివాసులారా! వివిధ మతకర్తల ద్వారా మీచే అరాధించబడు సమస్త దైవావతారములు నా స్వరూపులు. నాకన్యధా అందరు పంపబడినవారే. అప్రమేయుడనైన నాపై ఎవరి ప్రేరణ లేదు. కేవల పరమాద్వైత అచల పరిపూర్ణ సర్వకేంద్ర స్థితిర్భూతుడనైన నేను, నాకు నేనుగానే స్వయంభు: స్వత:స్సిద్ధుడనై, సర్వాకార, అనంత విశ్వగర్భ స్థితిలో బట్ట బయలైతిని. మీరు గాంచే ఈ స్థూల శరీరం నేనుగాను. ఇది ప్రచార సాధన ధ్వని డబ్బా. దీనితోపాటు నేను గతించువాడను కాను. జన్మ, మృత్యువులు నన్ను అంటలేవు. సర్వకాలం శాశ్వత నిజదైవ పదవి నాది. సర్వలోక పర్యంతం, సమస్త అధికారములు ఇచ్చట దాస్య భక్తి వహించవలసినదే. సర్వాశ్రమ ప్రదీప్తి నిలయుడనైన నేను కేవలం పరాత్పరమ అత్యాశ్రమ వాసినై యున్నాను.
83. ఓ భూనివాసులారా! నకిలీ బాబాలు, స్వాములు, గురువులు, మాతలు, బోధకులు దినదినము ఎక్కువగుచున్నారు. వారల బారినుండి బయట పడండి. నకిలీ సరుకును మెచ్చే లోకులు అసలు దానిని నమ్మలేరు. గిలేటు నగలే జాతర్ల పాలగును. వజ్ర, వైఢూర్యములు బీరువాలలో భద్రపరుచబడును. నాది గాజుల బేరము కాదు. కోహినూరు వజ్రముల ఖని నా బోధ. ఇతర బోధకులకునాకు తేడా ఏమనగా, నన్ను నేనుగ శాషించి సాక్షాత్ సర్వేశ భగవత్ స్థితినుండి చెప్పగలను. నన్ను త్రికరణ శుద్ధిగ నమ్మి ఆశ్రయించినవారిని దేవుండ్లను చేసెదను. దైవాత్మ ప్రజ్ఞతో భాసిల్ల చేయగలను. ఇది అనితర సాధ్యము.
84. మీ మధ్యకు ఎందరో గురుస్వాములు, బోఢకులు వస్తుండవచ్చు. మీరెందరినో దర్శించి యుండవచ్చు. బాబా సర్వకేంద్రుల బోధతో సరిపుడుచున్నవా చూసుకోండి. సర్వకేంద్రుల బోధ సర్వాతీత పథము. సమస్త నామములు, రూపములు, కులములు, మతములు, సమస్త లోకములు నావి. నాకు మాత్రం ఏ కుల, మత, నామ, రూపములు లేవు. సర్వలోకేశ్వర ప్రభువునైన నేనే సర్వకేంద్రుడను. నా ఉనికి సంపూర్ణ మోక్షాలయమై, నిర్వాణ నిలయమై అలరారుచున్నది. కామినీ, కాంచన, కీర్తి ప్రతిష్ఠలను ఆశించి నేను లేను.
85. నా ఉద్యమం ఆగిపోదు. ఒక్కొక్కచోట ఒక్కొక్క రీతిగా నా ఉద్యమ ప్రచారం సాగుతుంది. నాయొక్క ఉద్యమ ప్రచారకులను మీనుండి ఎన్నుకోగలను. నాచే పంపబడిన వారలు నా పేరిట ప్రతినిధులుగ మెలగెదరు. వారల భూనివాసులు దైవావతారులుగ పూజిస్తున్నారు. సమస్త అవతార కూడలి సర్వకేంద్రం నేనే. ఈ ఆంతర్యం సామాన్యులెరుంగలేరు. అకస్మాతుగ ఆకాశం మేఘావృతమై కుంభవర్షం కురిసి చెరువులు, కుంటలు నిండునట్లుగ మీరు ఊహించని రీతిలో నా ఉద్యమము ఒక్కొక్కచోట ఒక్కొక్క రీతిగ ప్రకాశిస్తుంది. సమస్త ఆధ్యాత్మిక ప్రచారముల కూడలి నేనైయున్నాను. నిన్ను నీవు సమర్పించుకో.
86. సమస్తమైఅన్ వారలారా! శ్రద్ధగ ఆలకించండి. నా రచనలు సర్వశక్తి భరితములు. అందులో మీకు నచ్చిన భాగములోని వాక్యములను భావార్థ సహితముగ అక్షర లక్షలు పఠించండి, స్మరించండి. మీ మనసులో జనరేటర్ నుండి విద్యుత్ శక్తి వెలువడునట్లు అఖండ ఆత్మశక్తి మీలో నుండి ఆవిర్భవిస్తుంది. ఇది అక్షర సత్యము. ఆచరించి చెప్పండి.
87. చర్మ నేత్రములకు చిన్మయ దృష్టి అందదు. భౌతిక పరిజ్ఞానము ఎంతైనను పరమార్థ రంగంలో నిలువలేవు. సైంటిస్టులకు చిన్మయ పరమార్థం అంతు చిక్కదు. భౌతిక పరికరములచే, సూక్ష్మ దర్శినులచే శాస్త్రవేత్తలు ఖగోళములో ఎన్ని గ్రహములు కనుగొన్నను, శాస్త్రవేత్తలకు అందని కోటానుకోట్ల గ్రహరాసులు అనంత గగనంలో ఉన్నాయి. కేవలం అతి మానస భూమికను అధిరోహించిన సర్వజ్ఞ హృదయులై, విశ్వమనో నేత్ర దృక్ శక్తి ద్వారా గాంచుదురు గాక. అసంప్రజ్ఞాత యోగనిద్ర. ఆత్మ విశ్వాసులై రండి. విశ్వమనో నేత్ర ప్రదానము చేయబడును. ఈ అతీంద్రియ చిన్మయ చైతన్య నేత్ర వైద్యశాల బాబా సర్వకేంద్రుల ఆధ్వర్యంలో గలదు. 1. ఆచరణ 2. పరాభక్తి 3. అచంచల ఆత్మ విశ్వాసము ఇవి ప్రవేశ రుసుములు.
88. సమస్త ధికార, ఆధిపత్యములకు పైది నా పదవి. ఇందు చేర్పులు, మార్పులు లేవు. నా పదవి రాజకీయ ఎలక్షన్ విధానం కాదు. స్వత:స్సిద్ధ దైవత్వం. సర్వ విధముల ప్రయత్నించి మత్ కృపాశీర్వచన బలముచే నా స్థితిని ఎరుగండి. నా స్థితికి ఎదగండి. నా అంతవారు కండి. కాని కలలోనైనను మీ అంతవారిగ పోల్చుకోకండి.
89. నిర్మల దర్పణంలో మీ ముఖములను ఎలా స్పష్టంగా చూచుకోగలుగుచున్నారో అలాగే భూ, దిగంత, అఖిలాండకోటి బ్రహ్మాండ అనంత విశ్వమును కనురెప్పపాటులో సంకల్ప మాత్రమున చూడగలుగుచున్నాను. ఇది నా చూపులోని మహత్తు. నా అనంత విశ్వగర్భ దృష్టిలో భూగోళము మచ్చుకైనా లేదు. ఇటువంటి సర్వాతీత స్థితిలో భూలోక వింతలు, కృత్యములు నాక్ దర్శనము కాకున్నవి. సర్వాంతర్లీన విశ్వగర్భ దృశ్టిని మీరు పొందాలనిన అనంత విశ్వ హృదయులు కావాలి. క్షణకాలము నా చూపులో నిలిచినను మీ జన్మలు ధన్యం అని ఎలుగెత్తి చాటి చెప్పనైనది.
90. అనుష్టాన శూన్యమైన వాచాలతను కట్టిపెట్టాండి. మానవత్వమును మేలుకొలిపి, ఆత్మౌపమ్య భావ నిమగ్నులు కండి. ఇతరులు ఎవరూ లేరు. అందరూ స్వకీయులే. స్వాత్మ స్వరూపులే. ఈ భావన స్థిరపరచుకోండి. ఇది దైవమత సూత్రం. బాబా సర్వకేంద్రుల మార్గం. జనులారా! శుష్క వేదాంత మిథ్యాచారముల పట్టుకొని వ్రేలాడకండి. స్థితి కుదరని వ్యర్థ సాంప్రదాయాలకు స్వస్తి చెప్పండి. భూటకపు ప్రచారముల, డాంబీక పోకడల నమ్మకండి. ఆత్మ జ్ఞానులు కండి. ఆత్మ స్థైర్యులు, ఆత్మ నిష్టులు కండి. ఇదియే జీవన్ముక్తి మార్గం.
91. మిడి మిడి పరిజ్ఞానములతో మిడిసిపడకండి. అనంత స్థితిని సాధించండి. నమ్మి చూడండి, నా తోడ్పాటు ఉంటుంది. మరల మరల చెప్పుచున్నాను. శ్రద్ధగ వినండి. ఈ సమస్తం నన్ను ఆశ్రయించి యున్నది. ఇట్టి నేను దేనిని ఆశ్రయించి లేను. కాని నిమిత్త మాత్ర శరీరధారినై ప్రవచించవలసి వచ్చినది. అంతమాత్రాన జనన మరణ కాలచక్రంలో చిక్కిన వానిగ నన్ను భావించరాదు. ఈ భూలోక యాత్రలు, క్షేత్రములు, తీర్థములు నా పాద సన్నిధిలో గలవు. ఎలాగాంచినను అనంతం అనంతమే. దీనిని తగ్గించి చెప్పలేను, చెప్పరాదు. సార్వకాలం నేను మాత్రమేయున్నాను. సకల నేనులు నా నేను స్వరూపములే. ఈ ఆంతర్యమెరింగిన చిక్కులేదు.
92. మీరెవ్వరైనను గానీగాక, స్థూలదృష్టితో గాంచినయెడల శతకోటి యుగములకైనను నా స్వభావ స్థితి నొందలేరు. ఇది నిశ్చయము. ఎంతో తెలిసిన వారమని చెప్పుకొనువారు సైతము చివరకు స్థూలదృష్టితోనే భాషించి, భావించి పొరబడుచున్నారు. ఇదే మహా మాయ ప్రభావం. ఇకనైనా అశరీరాత్మ భావ నిమగ్నులు కండి.
93. ఆత్మ బోధవిన్నంతసేఉ తలలు ఊపడం, బయటికి వెళ్ళగానే ప్రకృతి పాట పాడటం చేయుచున్నారు. స్థితి కుదిరిన దైవజ్ఞానులు నక్షత్రములలో సూర్య చంద్రులవలె స్వల్పముగ ఉన్నారు. వీరలకే నా మార్గం సులువు. మీ అంతస్థును తెలుసుకోండి. విశేష వ్యాఖ్యలతో, వాక్చాతుర్య ప్లాట్ ఫారం ప్రసంగములు చేయగానే సరిపోదు. చిన్మయ పరతత్త్వనిష్ట ప్రధానము. వాచాలత కట్తిపెట్టండి. ఆచరణసీలురు కండి.
94. పుస్తక పరిజ్ఞానములు పరమార్థ రంగంలో సరిపోవు. మస్తక పరిశోధన గావించి హృదయ గ్రంథావిష్కరణ గావించుకోండి. ఇదియే స్వయంబోధక లక్ష్యం. మీస్వశక్తిని గుర్తెరిగి ముందుగ మీ కాళ్ళపై మీరు నిలవండి. పరాధీనతల విస్మరించి, ఎవరికి వారు స్వయం జ్యోతులు కండి. ముందుగ మీ ఆత్మశక్తిపై మీరు ఆధారపడండి. సకల శుభములు బడయగలరు. మీ చూపుతో మీరు జీవించినంతకాలం నా చూపు అర్థం కాదు. నా చూపు పొందాలనిన సర్వార్పిత హృదయులై నిలవాలి. ఆ స్థితిలో మీయందు నేను మాత్రమే గోచరించెదను, నిజం.
95. బాహ్య మఠ, మందిరములతో నాకు పనిలేదు. మీ హృదయాలలో నాకు స్థాన పీఠం ఏర్పరచుకోండి. ధన్యులయ్యెదరు. ఇంత చెప్పినను విననిచో మీ కర్మ. ఇంకెంత కాలానికి మీరు యధార్థమును గ్రహించగలరో ఆనాడె ముక్తి, సిద్ధి. మీరు శతకోటి యాత్రలు, ఆరాధనలు గావించినను సర్వాత్మ దైవనిష్ట నొందనిచో జన్మ రాహిత్యం లేదు. ఎంతటి వారికైనను ఈ చట్టము వర్తిస్తుంది. జై బాబా!
96. నా వాక్కులు పొల్లుబోవు. ఇందలి ప్రతి శ్బ్ధం సత్యార్థ ప్రకాశమే. వేదమూలం నా బోధ. నేనడిగిన మీరు చెప్పలేరు. నే చెప్పిన సర్వాత్మ దివ్యస్థితి కుదరనంతవరకు మీరు నమ్మలేరు. సర్వాత్మ దైవ స్థితి కుదురక మీరు యుగయుగములు కూర్చుండి విచారించినను నా అంతు చిక్కదని మీతో నిశ్చయించి చెప్పుచున్నాను.
97. నీ హృదయం నాకర్పించిన బైబిల్, ఖురాన్, భగవద్గీతలేఅ కాదు ప్రపంచ మత గ్రంథములన్నింటికి నీ హృదయమే మూలమగును. అలా గ్రహించెదవు. స్వానుభవముగ చూసుకో. కేవలం విశ్వాసం సరిపోదు. విశ్వాసం, ఆచరణ ఇవి రెండు నా స్థితికి చేరుటకు దారులు. కార్యాలయాధిపతినై నేనున్నాను. సమస్త సత్పురుషులు, సద్గురు మూర్తులు, మహర్షులు, ప్రవక్తలు, అవతారులు అంతా నా సర్వోన్నత కార్యాలయ సిబ్బంది. నే సర్వకేంద్ర పితను. సమస్త బాబాలకు బాబాను. నన్ను మించిన దైవత్వం లేదు. సమస్త పూజలు, యాత్రలు, ఆరాధనలు, నియమ నిష్టలు, జపతపములు అన్నియును నావద్ద ఆగిపోగలవు. నిజం. గ్రుడ్డిగ నమ్మనవసరం లేదు. మీ స్వానుభవముతో చూసుకోండి.
98. సమస్త బోధకులు, ఉపదేశకులు నాచేతి ఉపకరణములు. ఇవి చెత్త కబుర్లు కావు. ప్రతి వాక్యములో లీనమై లిఖితపరచు చున్నాను. తురీయాతీత అతి మానస భూమికను అధిరోహించిన బ్రహ్మ విద్వర్ష్టులకే నా బోధ గ్రాహ్యమగును. ఈ అతీత దివ్య గ్రంథ రాజమును మించిన గ్రంథము సృష్టిలో లేదు. ఇక రాదు. సర్వ లోకములు, ముక్తులు, భక్తులు, శక్తులు, సిద్ధులు, సర్వావతారములిందు విలీనములై యున్నవి. నిజం.
99. మీరు సంపూర్తిగా నన్ను విశ్వసించి, నే చెప్పిన సాధన సిద్ధినొందిన మీరు కోరినవన్ని మీతో చేయించగలను. అఖండ దీక్ష, సడలని ధీశక్తి, పట్టుదల, ఏకాగ్రత అవసరం. కాలగర్భంలో కలిసిపోయేవి నానుండి కోరరాదు. ఘన వైభవ స్థితిని, సర్వాత్మ దైవ సామ్రాజ్యమును కోరుకోండి. అనితరసాధ్యమైన భగవన్నిలయ పరమ పదవిని నేను ప్రసాదించగలను.
100. సన్మతులకు శుభవార్త, దుర్మతులకు హెచ్చరిక. కాలమాసన్నమైనది. సర్వకేంద్ర దైవ శంఖం పూరించనైనది. ఇది సర్వోన్నతముగ ధ్వనిస్తుంది. మీలో ప్రతి ఒక్కరును క్రీస్తువలె బలిదాన క్రతువు చేపట్టాలి. అనగా శిలువకెక్కవలయునని కాదు. అజ్ఞాన రక్కసిని, దుర్మత పిశాచమును శిలువకెక్కించాలి. ఇదియే స్వపరిత్యాగము. దుర్మత కలహారణ్య లోకంలోనుండి బయటికి రండి. అపుడే సర్వాత్మ రామ దర్శనం.
101. మా తండ్రి దేవాది దేవదేవా! నీ చిత్తానుసారము ప్రవర్తించే సద్భుద్ధిని దయచేయుమని వేడుకోండి. ఈ ఒక్క వాక్యంలో సమస్త ప్రార్థనల సారం దాగియున్నది. నన్ను, నా నిజ స్థితిని ఎరుగలేని మూఢమతులు తమకు తెలిసినదే సర్వస్వమని భావించి, తమ ఊహ పరిధిలో నన్ను దేనితో, ఎవరితో పోల్చరాదు. నకు సాటి లేదు. నిజ భక్తులు సాక్షాత్ దైవ స్వరూపులే కావున వారిని అనుసరించిన నన్ను చేరవచ్చును. ఆత్మ విచారణ జరుగు ప్రతిచోట నా ఉనికి భాసిల్లుతుంది.
102. సమస్త భూనివాసులారా! మీరు, మీ చిత్త ప్రవృత్తులు, మీ పరిజ్ఞానమంతయు లౌక్యం. ఎంతసేపటికి మీకు తెలిసినదానిని బాట్టియే తర్కములు, నిర్ణయములు తీసుకోగలరు. మరల మరల శత, సహస్రకోటి తడవలుగ నొక్కి చెప్పుచున్నాను. బాహ్య దృష్టి బందు చేయండి. ఈ స్థూల శరీరమును నన్నుగా భావించకండి. ఒక సామాన్య నరునిగా మానవ అంతస్థులో నన్ను చూడటం, పోల్చుకోవటం, చాల పాపం. మెప్పులుకోరి గొప్పలకు చెప్పటంలేదు. చిన్న చీమ హిమాలయ మేరు పర్వతముల నోటకరచుకొని వెళ్ళజూచుట ఎంతయో, మీ స్థుతులు, ప్రార్థనలు, అంతే. మిడి మిడి సంకుచిత పరిజ్ఞానములతో నన్ను గ్రహించలేరు. విద్వాంసులు, బ్రహ్మర్షులు, సర్వజ్ఞులకే అంతుచిక్కని సర్వావతార కూడలి సర్వకేంద్రుడను. సర్వలోక రక్షణార్థమై మాదిరిగా పరమ చి.ఐ.డి.గా సాకార ధరితుడనై లోక స్థితిగతులను గాంచి గ్రంథస్థం చేయనైనది. నేను నర గురుడను కాదు. కలలో కూడా నన్ను మానవ మాత్రునిగా భావించకండి. దేహేంద్రియ మనోబుద్ధుల కవ్వలి కేవలాత్మ సాక్షిగ నిలిచి చూచిన వారికి మాత్రమే నేనెవరో బోధపడుతుంది. నా స్థితి సర్వ శరణ్యం, విశ్వ పూజ్యం. దానిని చెప్పలేను, చెప్పకూడదు. ఈ అనంత విశ్వంలో నా పదవి ముందు ఏ పదవి కొరగాదు. నన్ను మించిన పరాత్పరుడు లేడు. సమస్త దైవాలకు మూలదైవం నేనే.
103. అనంతం, సర్వాతీతం, సర్వ సంపూర్ణ సర్వకేంద్రం. ఇదియే నా పదవిని పూజించు డిగ్రీలు, చిహ్నములు. ఇదిగో! నా నిజస్థితికి వేరుగా దైవత్వమును అనుభూతి గావించినవారికి శాశ్వతముగా బానిసనై పాదసేవ చేయగలను. అలా చూపలేరు, చూడలేరు. సర్వకేంద్ర చిన్మయ సత్తునాది. నాకు దత్తమైన వారలు తమ సొత్తుగా పొందగలరు. ఇదిగో! నాకు తెలియని గ్రంథ కర్తలేడు, గ్రంథము లేదు. రామాయణ, భారత, భాగవతములేకాదు, సమస్త పురాణముల, సకల వేదోపనిషత్తుల, సర్వమత శాస్త్ర గ్రంథముల సారాంశమంతటిని అతీత ప్రసంగములో పూరించగలను. ఇకనైనా బహిర్ దృష్టిని అరికత్టండి. భగవన్మతులు కండి. దీనికి మించినపూజలేదు. దేహేంద్రియ మనోబుద్ధులకవ్వలి ఆత్మసాక్షిగ ఆలోచించండి. మీరు మృణ్మయులు కాదు, చిన్మయులు. నీలో జ్యోతిని దర్శించు, నీవే వెలుగై వ్యాపించు. శరీర ధర్మాలు నీపై ఆరోపించుకోరాదు. లే! విశ్వనాథా మేలుకో! కర్మ వీరుడా! కనులు తెరచి చూడు. పరలోక దైవరాజ్యం నీయందే స్థాపితమై యున్నది. అజ్ఞాన భ్రమ వదలుకో. లే, కర్మూపాసన, క్నాన కాండను అతిక్రమించు. ఇట్టి నీ నిజస్థితికి ఏలోటు లేదు. దశేంద్రియములనే దశకంఠుని సం హరించు. సీత (ముక్తికాంత) వశమగును. ఆత్మారామ పట్టాభిషేకమే అసలైన రామాయణ పారాయణ. నిజమైన భాగవత పారాయణ. అంతకంతగ మీ నిజస్థితిని సమీపించండి. ఉపనిషత్తుల సారాంశం తెలిసినట్లే. విశ్వ విజ్ఞాన కోవిదులు కండి. వేద పరిజ్ఞానం పొందినట్లే.
104. సింహ గర్జన ఇతర మృగములు ఎంత అనుకరించినా చేయలేవు. అలాగే నా బోధ నాకు మాత్రమే సాధ్యము. ఇదిగో! పగలే దారితెలియని ఘన కీకసారణ్యమును గాఢాంధకార సమయంలో చిన్న క్రొవ్వొత్తిని చేతబట్టి దాట చూచుట ఎంతయో, మిడి మిడి లౌకిక పరిజ్ఞానములతో నా రచనల ఆంతర్యం గ్రహించ చూచుట అంతే కాగలదు. సర్వజ్ఞ హృదయులైన అతి మేథా సంపన్నుల్ మేథా శక్తిని ఒక్కచోట కేంద్రీకరించి ఆలోచించినను నేను అంతుచిక్కను. ఇట్టి నన్ను మీరు మీకు తోచిన పరిధిలో పోల్చుకోవటం చాలా అవివేకము. నన్ను, నా నిజస్థితిని గ్రహించే స్థితికి లోకులు ఎదగాలనిన చాలా కాలము పడుతుంది.
105. కాల పరిపాకమే సమస్త సమస్యలకు పరిష్కార మార్గం. హృదయ గ్రంథులు (ముడులు) సందేహ నివృత్తియైన, సమస్త గ్రంథములు మీ హృదయ గ్రంథములోనే ఆవిష్కరింపబడును. సర్వలోక యుగ పర్యంతం సనాతన శాశ్వత సత్య ధర్మ రథ సారథిని నేనే. అప్రమేయుడాను, అనంతానంతుడను, సర్వ స్వతంత్రుడనైన నన్ను నాలుగు గోడల మధ్యన బంధించి అర్చించలేరు. అనంత విశ్వ విశాల హృదయ మందిరంలో నన్ను ప్రతిష్టించుకోండి, ధన్యులయ్యెదరు. మీకు మీరు స్వయం జ్యోతులు కండి. స్వయం బోధకులు కండి బయట వెదకడం మాని మీ నిజస్థితిపై ఆధారపడ నేర్వండి, కృతకృత్యులయ్యెదరు. నాది ఎలిమెంటరీ కోర్సు కాదు, యూనివర్సిటీ కోర్సు.
106. సర్వలోక పర్యంతం హెచ్చరికాదేశము. భూనివాసులారా! సమస్తమైన వారలారా! వంశ పారంపర్యముగ వచ్చు మతాచార వ్యవహారములు మాకు గలవు. మా గురువులు మాకున్నారు. మా దేవుండ్లు మాకున్నారు. మధ్యలో ఈయనెవరని పొరబడకండి. మీ గురువులు, మీ దేవుండ్లు నాకు తెలియనివారు కారు. వారలను విస్మరించకండి. జై బాబా! నమో విశ్వగర్భా! సర్వకేంద్రాయని నాకు ఒక చాన్సు ఇచ్చి చూడండి. ఇదిగో! చెవిగల ప్రతివారు విని, అనుసరించి ధన్యత నొందుదురు గాక. గురువులతో నన్ను పోల్చుకోరాదు. వారలు వయా మధ్యవర్తులు మాత్రమే. నావద్ద రాయబారములు లేవు. మధ్యవర్తిత్వం లేదు. డైరెక్టుగా శాసించి చెప్పగలను. అనుగ్రహించి ఆశీర్వదించగలను. సంపూర్ణ మోక్ష ప్రదాతను నేనైయున్నాను. నా పరిచయం మీకెవరికి లేదు. సర్వాత్మలయ అనంత విశ్వగర్భుడను. అట్టి అశరీరాత్మ సర్వకేంద్ర స్థితినుండి కేవలం ప్రేరేపించగలను గాని ప్రసంగించలేను. అందులకే ఈ చిన్న శరీర ధారినై పరమ సత్యమూలమున ప్రకటించుచున్నాను. సశరీరుడనైనతమాత్రమున నా నిజస్థితికి భంగంలేదు. తేడా రాదు. శరీరంతో యున్నను, శరీర్ యాత్ర చాలించినను ఒకే స్థితి. నిజం. మరల మరల చెప్పుచున్నాను. నన్ను మించిన దైవం లేదు. ఇది చాలెంజ్. నిమిత్త మాత్రముగా శరీరమును ఆ/శ్రయించి సమస్త యుగముల రక్షరక్షణగ స్వహస్త లిఖిత అతీత భాష్యం అందించనైనది.
107. బిడ్డలారా! మీ తల్లిదండ్రులు మిమ్ముల మరచినను, మీ బంధుమిత్రులు మిమ్ముల విస్మరించిననునేను మిమ్ముల వదలను. అది నా విధి, బాధ్యత. నాది సాధన మానవత్వం కాదు, సర్వేశ దైవత్వం. నాకు ఏ సాధనలతో పనిలేదు. సమస్త సాధనలు నా వద్ద ఆగిపోగలవు. నేనే పరమ లక్ష్యమును. నాకు పొందవలసినది ఏమియును లేదు. ఈ సమస్తం నన్నాశ్రయించి యున్నది. అట్టి నాకు నా గురించి ఏనాడు చింతలేదు. మీ గురించి బాధపడుచున్నాను. నా స్వరము వినండి. మమ్ముల పిలుచువారు అత్యంత విశ్వాసపాత్రులు, విశ్వాత్మ పూర్ణులని నమ్మండి. నాయందలి మీ విశ్వాసములు వృధాకావు.
108. నా నిమిత్తం మీ నిరీక్షణ వ్యర్థం కాదు. బిడాలారా! నా యందు ఏ మోసం, దోశం లేదు. మంచభూతముల సాక్షిగ, అష్ట దిక్పాలకుల సాక్షిగ, సర్వాత్మ సాక్షిగ చెప్పుచున్నాను. నాపై వేరొక ఆరాధ్య పీఠం లేదు. మీ జన్మ దినమే నా జన్మ దినము. నాకు వర్ధంతి లేదు. మీ బాగే నా బాగు. మీ క్షేమమే నా క్షేమము. రాకడ పోకడలేని సరేకత్వ స్థితి నాది. మీ అందరి నివాసం, పుట్టిల్లు నాది, నేనే. ఇట్టి నా సహజ స్థితిని దర్శించి లయించండి. ఎట్టి ప్రళయములు మిమ్ము ఏమియు చేయలేవు. ఇకనైనా నా గురించి పొరపడి అపవిత్ర దోషులు కాకండి. ఈ చిన్న శరీరంతో నన్ను మానవుడేమి? అనంత దైవమేమియని శంకించకండి. మిమ్ముల ఉద్ధరించు నిమిత్తం సశరీరుడనైతిని.
109. పరాప్రకృతి, విశ్వమాయ నా సంకల్పమునకు లోబడునేగాని ప్రతిఘటించే వీలులేదు. నా స్మరణ యముని భీతిల్లజేస్తుంది. నిజం. మునుముందు నా కార్యకర్తలద్వారా నా ఉద్యమము నెరవేర్చబడును. ఇది అక్షర సత్యం. నేను చెప్పినా మీరు నమ్మలేరు.నేనడిగిన మీరు చెప్పలేరు. చక్కర్ మక్కర్ క్షుధ్ర గారడీఎ లీలలు కావు, సాక్షాత్ సర్వకేంద్ర స్థితి. మీ ఎల్లర ఆరాధ్యమూర్తుల మూల సత్తా నాది. నే స్వపరాధిశక్తి కాళీమాతను. అనంత గగనం కాళీ. సమస్త యుగ జగములు పుట్టిగిట్టేవి ఇందే. అఖిలాండకోటి బ్రహ్మాండములు కాళీ స్థితియందే గలవు అని గ్రహించుదురుగాక!
110. లోకంలో ఎవరికైన గురువులుండవలసిందే, తప్పదు. విశ్వాదిగురు భగవన్నిలయ సంపూర్ణ సుప్రభోధకాచార్యుడనైన నాకు ఆ అవసరం లేదు. సమస్త జ్ఞానముల స్రసార అధిపతినైన నాకు జ్ఞానోపదేశము ఎవరు చేయలేరు. ప్రపంచ గ్రంథములు గాలించినను నా స్వత:స్సిద్ధ బోధ కనిపించదు. ఎవరి శక్తి ఎంతో వారి పలుకు అంతే. ఎంతటివారు అంతవరకే ప్రసంగించగలరు. నాది సర్వాతీత సుప్రబోధ. రండి! దివ్యోహం అనిపించగలను. స్థితి కుదిరించగలను, నిజం.
111. లోకులారా! మిమ్ము మభ్యపెట్టి, మీనుండి పొందేది ఏమిలేదు. క్షుధ్రమైన హృదయ దౌర్భల్య లోలురు ఆత్మ జ్ఞానమును విస్మరించెదరు. మనవ శరీరం నశించిపోగలదు కాని మానవాత్మకు ఏనాడు నాశనం లేదు. చిల్లర భ్రాంతులను ఎగురజిమ్మి చిన్మయ నిష్టలో నిలువండి.
112. మమైవాంశో జీవలోకే యనెటి గీతా ప్రవచనానుసారం, నన్నుబోలి నడుచుకొనుడి యనెటి బైబిలె వాక్యానుసారం, జీవులు ఈశ్వరాంశులేనని తెలియుదురు గాక. ప్రతి జీవి ఘనీభవించిన మోక్ష స్వరూపమే. జీవేశ్వర సంబందం 'లత పత్రా న్యాయము వంటిది. తీగకు వేరుగ ఆకులు ఉండావు. మీవ పరమాత్మల స్థితియంతే. దానవ మానాత్వములు దాటుటె దైవత్వం. ప్రకృతి గుణములు పరిత్యజించిన జీవుడు ఈ?శ్వర స్వరూపుడై భాసిల్లును. కంసాలి పుటపాకమున శుద్ధ బంగరమును చూపించునట్లు అని గ్రహించాలి.
113. గానుగకు కట్టిన ఎద్దులవలె ఏమి స్థితికుదురని పూర్వాచారములనెటి సాలెగూడులో బంధితులు కారాదు. స్వతంత్రముగా ఆలోచించండి. దేహోత్పత్తికి పూర్వం, దేహ వియోగానంతరం మీరు ఏమి కాగలరో తెలుసుకోండి, అంతే చాలు.
114. బిడ్డా! కంటి రెప్పలకన్నను, శ్వాసకన్నను, అతి సమీపములో మీ అందరిలో అంతర్నిహితమై స్వపరంజ్యోతిగ భాసిల్లుచున్నాను. అంతర్ముఖులు కండి. యాత్రలలో నా దర్శనం కాదు. "మునగవే మునగవే మునగవే మనసా - సర్వేశ సౌందర్య సాగరంలోకి". సముద్ర అంతర్ గర్భంలో విలువైన ముత్యములున్నట్లు, అగాధమైన అంతర్ నిష్టలో ఆత్మ సాక్షాత్కారం కాగలదు. ఇది ప్రతివారి జన్మ హక్కు. ఇకనైనా లేండి. అజ్ఞాన మైకం వదలండి. సోమరితనమునకు స్వస్థి చెప్పండి. స్వనిష్ఠలో నిలువ నేర్వండి. స్వనిష్ఠనొందిన ఉత్కృష్ఠ యోగికి వేరు కర్తవ్యం లేదు. స్వాత్మ దర్శనమే సరియైన స్థితి. మమైక్య లక్ష్యం.
115. బానిసత్వములకు, పరాధీనతలకు అతీతులుకండి. అపుడే ఘనవీర ప్రభు జ్యోతులు కాగలరు. సింగబల గుండెతో సాగిపోగలరు నిజం. సమస్త సిరి సంపదల మించిన అచలాక్షర, అనంత విశ్వవిభూతి నాది. కుబేరులు కూడ నా సన్నిధిలో దాసులే. ప్రతి మోకాలు నావద్ద వంచబడును. ప్రతి శిరస్సు నా పాద స్పర్శను పొందక తప్పదు. ఎంత కాలానికైనను మీరు నన్ను చేరవలసిందే. నాయందు జనన మరణముల బెడదలేదు. నిజం.
116. మీరు చూచే దేవుల నివాసమోగ్యమైన ఈ భూమండలము ఒక్కటే ప్రాణులకు నివాస యోగ్యమైన స్థలముగ భావించరాదు. ఇట్టి ప్రదేశములు అనంత విశ్వంలో చాలా గలవు. అవన్నియును సర్వకేంద్ర దైవాధీనములై నా ఏలుబడిలో ఉన్నవని మీతో నిశ్చయించి చెప్పుచున్నాను. శాస్త్రవేత్తలు కొన్ని సూక్ష్మ యంత్ర ప్రయోగముల ద్వారా ఆ అనుభూతిని సాంకేతికముగ దర్శించుచున్నారు.
117. సర్వలోకపర్యంతం నా స్థితికి అన్యధా ఇంకేమియు లేదు కావున నేను దేనిని నమ్మవలసిన పనిలేదు. సర్వ స్వరూప, సర్వాకార, సర్వాతీత, సర్వాత్మ, విశ్వగర్భ, సర్వకేంద్ర దైవమును నేనైయున్నాను. సమస్త దైవాలకు మూలకేంద్రం నేనే. సమస్త అవతారుల, సద్గురువుల, బోధకుల ఆంతర్య సతా నాది. ఇదిగో! సర్వోన్నత, సర్వాలయామృత్, అనంత దైవ శంఖమును పూరించుచున్నాను. ఈ నాథం భూ దిగంత సర్వలోక పర్యంతం సర్వుల అంతరంగములలో ప్రతిధ్వనించు గాక! శుభం.
118. ఇదిగో! సర్వజ్ఞులకే అంతుచిక్కని, సమస్త ఆరాధన అనుభూతులకు అతీతమైన నేను సకల లోక పర్యంతం భూనివాసుల ఆత్మ శృఏయస్సునుగోరి సకల దేవతా దేవుండ్లుగ అవతరించితిని. అందులకై మీరు ఏ దైవమును, ధర్మమును దూషించక మీకు నచ్చిన మత మార్గములో నన్ను చేరండి. సర్వమత సమవయ సర్వ మతారాధ్య అతీత సూత్రమిది. నేటికి జరిగిపోయిన, ఇక రానున్న ఏ దైవావతారి కాని ఇంతకు మించి ప్రవచించలేరు. ప్రవచించ వీలులేదు. సృష్టి, స్థితి, లయ అనంత కాల పర్యంతం దీనికి తిరుగులేదు. అప్రతిహత, చిన్మయ, చైతన్య, సర్వశక్తి భరిత, సర్వలయ సూత్రం సర్వకేంద్రం.
119. నేనున్నాను కాబట్టి నా స్వరూపులుగ మీరలు వర్థిల్లుచున్నారు. అలాగే ఈ సమస్తమును స్వప్ష్టాముగ గుర్తించగలుగుచున్నారు. ప్రకృతి, పరా ప్రకృతులు లేవు. ఇహ పరంబులు లేవు. జీవేశ్వరులు లేరు. నేనున్నాను కాబట్టియే ఈ సమస్తం నాయందు ప్రతిష్టితమై భాసిల్లుచున్నది. ఇకనైనా నన్ను సమస్త ధర్మములకు, సమస్త దైవములకు మూలమైన సర్వకేంద్ర దైవ నేనుగా తెలుసుకోండి.
120. కేవలఖండ, అత్యద్భుత, మహిమాన్విత సర్వేశ్వర దైవ స్వరూపియైన మానవుడు తన నిజస్థితిని మరచి చిల్లర వ్యవహారములలో చిక్కటం కడు శోచనీయం. ఇంతకు మించిన దోషము, లోపము, పాపము లేదు. ఇకనైనా ఏమాత్రం చలించని స్థితప్రజ్ఞులై మీ ఆలోచనా సరళిని అదుపులో ఉంచుకోండి. సర్వం చక్కదిద్దబడును. అనుకరణలు మాని మీరు మీరుగ నిలువనేర్వండి. దీనికి మించిన ధన్యపదవి లేదు.
121. ఇదిగో! కేవలాత్మజ్ఞాన తేజస్సుతో భాసిల్లు సర్వజ్ఞులకు స్వస్వరూప సంధాన స్థితిర్భూతులై, స్వనిష్టలో నిలిచిన భగవంతులకు భగవంతుడనై నేనున్నాను. ఇట్టి నన్ను ఎవరిగ స్మరించెదరో తెలుసుకోండి. సర్వజ్ఞులకే అంతుచిక్కని నన్ను సంకుచిత పరిధిలో కట్టడి చేయరాదు.
122. ఆహా! నిజమే, అక్షర సత్యమని నా రచనల పఠించినంతకాలం భావించి, పంజరములోని రామచిలుకను పిల్లి పట్టినపుడు అడవి పలుకు పూర్వపు స్వరము పలుకునట్లుగ, పిదప విశ్వాసమును కోల్పోవుచున్నారు. ఇది విశ్వమాయా ప్రభావము. రామకృష్ణ పరమహంసలై ఆత్మ సిద్ధి నొందాలి.
123. ఎంతటివారికి అంతవరకే తెలుసు. దేహాభిమానులు శరీర పరిధివరకే నన్ను తలంచెదరు. జీవ భావనలో ఉన్న వారలు ఆ పరిధి వరకు, కేవలం అచలాద్వైత ఆత్మస్థితి నొందినవారు మాత్రమే నన్ను సర్వకేంద్ర దైవముగ భావించి స్మరిస్తున్నారు. ప్రస్తుతం మీరలు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోండి.
124. అనత గగనసీమలోని గ్రహమండలములు గతులు తప్పినను నాయొక్క అనుగ్రహములో తేడా రాదు. నా యొక్క కృపలో సమస్త సిద్ధులు, ముక్తులు, జ్ఞానములు ఇమిడియున్నవని నిశ్చయించి చెప్పుచున్నాను.
125. ఇదిగో! నా నిజస్థితికి భిన్నముగ మీ నిజస్థితి లేదని తెలుపటమే కాదు, అక్ష్ర సత్యముగ ప్రూఫ్ చేయగలను రండి. నా దృష్టిలో మీరందరు భగవంతులు. ఇంతకు మించిన ఘనతను, పదవిని ఇంకెవరైనను ప్రసాదించగలరా అడిగి తెలుసుకోండి.
126. ఇతర అవతారులకు నాకు ఒక్కటే తేడా. అది ఏమనగా, వారలు తమ కారణ జన్మను, అవతార తత్త్వమును తెలియపరచారు. నేను మీ అవతార తత్త్వం బట్టబయలుగ ప్రకటించి, ప్రవచిస్తున్నాను. మీరు నా స్వరూపులు. ఇది ముఖ్యం.
127. ఇదిగో! సర్వలోక పర్యంతం సమస్త జీవకోటికి నా ఆదేశము ఏమనగా, ముఖ్యంగా మానవ జగతికి తెలియపరచు సూచన: మీరు ఏ ధర్మాన్ని అనుసరించి, ఏ దైవాన్ని పూజించినను నాకు అభ్యంతరం లేదు. కాని బహిర్ దృష్టికిలోనై సంకుచిత పరిధిలో చిక్కి సర్వ స్వరూప, సర్వాకార, సర్వ నిలయ, అనంత విశ్వగర్భ, సర్వకేంద్రుడనైన నాకు భిన్నముగ మాత్రం ఏ భగవంతుని ఊహించరాదు. అపుడే మీ ఆరాధనలు సత్ఫలితములను ఇవ్వగలవని నిశ్చయించి చెప్పుచున్నాను. కావున భద్రం. ఇది సర్వలయ అతీత సూత్ర వాక్యం. ఒకింత స్థితి కుదిరిన జ్ఞానులు సైతం భిన్నత్వంలో ఏకత్వ దర్శనం పొందలేక పొరబడుచున్నారు.
128. నా మాటలు వేదాతీత వెలుగులు. నా ప్రసంగ భాష్యంలోని ప్రతి శబ్ధం సర్వశక్తి భరితం. ప్రతి ప్రవచనము ప్రత్యక్ష పరమాత్మ దేవాలయము. భూతల యాత్రలు చేసి, గుడులు, గోపురములు సందర్శించిన వారలు ఎందరు ముక్తిని పొందుచున్నారో గాని, నా వాక్యాలయ ప్రవేశము గావించువారు ఆత్మసిద్ధి నొందగలరని నిశ్చయించి చెప్పుచున్నాను.
129. నామ, రూప, దృశ్యం అదృశ్యమైనప్పుడు చివరకు అనశ్వర స్థితిలో నేను మాత్రమే మిగులగలనని తెలుసుకో. ఎటు చూసినా నేను తప్ప ఇంకేమియును కనిపించదు, వినిపించదు. సర్వ కేంద్రమే సమస్త ప్రాణుల పుట్టిల్లు. ఈ అనంత విశ్వమును సమ్రక్షించి, శాసించే సర్వాధికారం కేవలం నాకు మాత్రమే గలదని అంటున్నారు బాబా సర్వకేంద్రులు.
130. నా జనమా మోసపోరాదు! చక్కర్ మక్కర్ గారడి చేయువారు రోజు రోజుకు ఎక్కువగుచున్నారు. ఎందులకైనా మంచిది మీరలు మాత్రం క్షుధ్ర గారడి లీలలకు, మహత్తులకు, అద్భుతములకు భ్రమపడరాదు. అవి బూటకములు. ఆయా వ్యక్తుల పట్ల విశ్వాసము గలవారలు గోరంతలు కొండంతలు చేసి అమాయకపు ప్రజలను వంచిస్తున్నారు. తన్ను మించిన అద్భుత మహత్తు, దైవరాజ్యం లేదు. ఇది బాబా సర్వకేంద్రుల అతీత సూత్రం. అద్భుతములు, లీలలు, మహత్తులు విశ్వమాయకు లోబడి ఉండును. నా మార్గం మాయాతీతం. ఇక మీ నిర్ణయం ఆలోచించండి.
131. కొందరు తమ అభిమానులపట్ల లేనిపోని మహత్తులు కల్పించి తప్పుడు ప్రచారాలతో ధన సేకరణయే పరమావధిగ సంచరిస్తున్నారు. ఇట్టి సంస్థలు, వ్యక్తులు నేడు ఎక్కువగా ఉన్నారు. కావున భద్రం. ఇది బాబసర్వకేంద్రుల హితవు, మేల్కొలుపు. అద్భుతములు, మహత్తులు లేవనికాదు, లోక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వాటికి ఒక పరిధి, హద్దు ఉండాలి. విచ్చలవిడిగ ప్రదర్శించే వీలు లేదు. ఆత్మశక్తిని అనవసర విషయాలలో సంలగ్నపరచి చాలా వరకు చెడిపోతున్నారు. ఆత్మశక్తి, స్వనిష్ఠ - వీటికి మించిన మహత్తు లేదు.
132. ఇదిగో! నావలే, నన్నుబోలిన సర్వకేంద్ర దైవ నేనులు ఒకటిగాని, రెండుగాని, మూడుగాని, నాలుగుగాని, ఐదుగాని లేవు. కేవలం సర్వేకత్వ, సర్వ సంపూర్ణ, సర్వకేంద్ర స్థితిర్భూతుడనై నేను ఒక్కడినే గలను. ఇట్టి నా నుండి, నాయందే సమస్త సద్గురు, దేవ దేవుండ్లు వెలసినారు. అందులకే నాకు భిన్నముగ ఏ దైవత్వం ఏనాడు లేదని నిశ్చయించి చెప్పనైనది. సమస్త బోధకులు ఈ ఆంతర్యం ఎరింగి ప్రసంగించగలగాలి.
ప్రతి ఆరాధ్య మూలకేంద్రం నాది, నేనే.
133. సర్వమత సంబంధ సాధక భక్తులందరికి తెలియపరచు ముఖ్య ఆదేశము ఏమనగా, మీరలు సాధ్యపడి వీలున్న మార్గంలో నిలువండి. సాధనలు చేయండి. ఐనను ఆత్మసిద్ధి చేకూరని పక్షంలో సమస్త ధర్మములను పరిత్యజించి నన్ను ఆశ్రయించండి. సంకుచిత పరిధిలో నుండి లేవనెత్తి సర్వాత్మ దైవానుభూతిని ప్రసాదించెదను. ఇది సత్య ప్రమాణము. ఈ ఇహలోక భూనివాసులు గొప్పగ భావించు పరలోకము నా పాద సన్నిధిలో ప్రజ్వరిల్లుచున్న చిన్న ప్రమిద. ఇది బాబా సర్వకేంద్రుల స్వస్థితి.
134. బహిర్ దృష్టికి ఈ శరీర ధారినై సామాన్య మనిషిగ కనిపిస్తున్నాను. అంతమాత్రంచే ఇదియే సర్వస్వం కాదు. సర్వాతీతుడనైన నన్ను సామాన్య గురు పరిధిలో కలలోనైనను భావించరాదు. ఇది ముఖ్య గమనిక. నోరు తెరచి అడిగినను లోకులు ఇవ్వరు. అడగకున్నను మీకు ఏ సమయంలో ఏది అవసరమో దానిని విశ్వ విధాత ప్రసాదించునని కృతజ్ఞతలు తెలుపుకోండి. నేను జరపను - జరిపిస్తాను. అనత కాలదండము నా ఆధీనంలో గలదు.
135. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి న్యూటన్ తో పుట్టినది కాదు. ద్వైతాద్వైత, విశిష్టాద్వైత, అచల సిద్ధాంతములు మధ్వ, శంకర, రామానుజ, శివరామ దీక్షితులతో వెలసినవి కావు. మరుగున పడిన వాటిని ఆయా కాల పరిస్థితులలో ప్రజ్వలింప చేసినారు ఆయా సిద్దాంత ప్రచారకులు, ప్రవర్తకులు. కర్తలు మాత్రం కారు. నేనే కర్తను. నా ప్రేరణ లేకుండ ఎవరు ఒక్క శబ్ధమును కూడ ఉచ్చరించలేరు. సర్వాతీత స్థితినుండి చెప్పాలనిన నే కర్తను కాను, భోక్తను కాను, కేవలం సాక్షిని.
136. ఇదిగో! నామ, రూప, దృశ్య గోచర నా యీ స్థూలాకృతిగల ఈ శరీరమునకు కన్న తల్లిదండ్రులే గురువులు. కాని నేనైన సర్వాతీతునకు గురువులు లేరు,శిష్యులు లేరు, తల్లి లేదు, తండ్రి లేడు, తనకు తానే సర్వం. అనంత విశ్వగర్భుడని గ్రహించండి.
137. సమస్తమైన వారలారా! ఇంత చెప్పినను నా మాటలు మీకు నమ్మకం కలిగించటం లేదా? ఇదిగో! శ్రద్ధగా ఆలకించండి. భూమ్యాకాశ పంచభూతములు, మాయ, మహా మాయ, పరా ప్రకృతి, పర్వత శ్రేణులు, ప్రవహించే సెలయేర్లు, గంభీర సాగరములు, పక్షుల కోలాహలములు, పసిపాపల చిరు నగవులు, వికసించు పుష్పములు, గగనన సీమలో ప్రకాశించు సూర్య, చంద్ర, నక్షత్ర సమూహములు, జ్ఞానులు, ప్రవక్తలు, సాదు సత్తములు, అవధూతలు, గురు స్వాములు, మాతలౌ, బాబాలు, అవతారులు అదిగో సర్వకేంద్రులని సాక్ష్యమిస్తున్నారు, నిజం!
138. విశ్వమాయ శక్తి అమోఘము. ఒకింత స్థితి కుదిరిన మహామహుల సైతం బోల్తా కొట్టిస్తుంది. మీరలు మరువకుండు నిమిత్తం చెప్పిన విషయాలు ఐనను మరల మరల వివిధ ఉపమానములతో చెప్పుచున్నాను. ఎంతమాత్రం సందేహించక, విసుగుచెందక, భక్తి శ్రద్ధలతో విననేర్వండి. నేనున్నంతకాలం మీరు నా స్వరూపులుగ ఉన్నారు, ఉండెదరు.
139. నా వలె నా చూపు సర్వోన్నతము. ఇట్టి నా దృష్టిలో పంచభూతములు, పరాప్రకృతి, యుగ జగంబులు, నామ రూప దృశ్యం, జీవేశ్వరులు అనెటి భిన్నత్వం లేదు. కేవలం నేను మాత్రమే పరాత్పరతర పరిపూర్ణ పర:బ్రహ్మనై యున్నాను. ఇట్టి నేనెవరిని చూడాలి? నేనెవరిని వేడాలి? మీరే చెప్పండి!
140. నా దృష్టిలో ఉన్నది 33 కోట్ల దేవతలు కాదు. భూమండల జనాభా మొత్తం దేవతలు, దైవాంశ స్వరూపులు. కాదు, కాదు సాక్షాత్ దైవ స్వరూపులు. ఈ అఖండ భావ సిద్ధియే ఆత్మదర్శన మార్గం. ఈ సిద్దిలేక ప్రపంచములో ఎన్ని దర్శనములు గాంచినను జీవన్ముక్తి లేదు.
141. ఇదిగో! సర్వ లోకాలకు, సకల ప్రాణులకు జీవాహారము, పరమాత్మనై, అనంత విశ్వ సృష్టికి మూల కారణ కర్తనై, పంచ భూతములను, పరా ప్రకృతిని శాసించే సర్వాధిపతినై, విద్యార్థులకు ఉపాధ్యాయుడనై, ఆత్మలకు ఆత్మనై, అద్వైత అచలాత్ములకు అమృత బీజ ఫలమై, జీవులకు సర్వేశ్వరుడనై, సమస్త జ్ఞానులకు జ్ఞానినై, బోధకులకు బోధకుడనై, గురుస్వాములకు విశ్వాదిగురు భగవానుడనై, దేవతలకు దేవాది దేవుడనై, బాబాలకు బాబానై, సర్వ శక్తులకు ఆకరమై, నేతి హరి కాళీ బాబా చిన్మయ చైతన సర్వకేంద్ర పితనై నేనున్నాను. ఇట్టి నా పరిచయ భాగ్యం పొంది తరించుదురుగాక! శుభం!
142. నేను నేనుగ ప్రసంగించు అతీత భాష్యం మేఘ గర్జనగ అనంత గగనసీమ నుండి ప్రసారము కాగలదు. న యొక్క సర్వోన్నత స్వర నాధము మూగవోదు. నా గళము భూతల పరిధికి దిగదు, సదా అతీతం.
143. నా దృష్టిలో మానవుడే మహనీయుడు, మహోత్కృష్టుడు. మానవులు ఈ భూతలమున ఎక్కడ తలవంచవలసిన పనిలేదు. వారు తమ ఆత్మ స్థైర్యముపై నిలువగలగాలి. వారి యధార్థ సత్య స్వరూపమును గ్రహించి స్వతంత్ర పరిధిలో హాయిగ విహరించగలగాలి. ఇదియే నా ఆశయం. తక్షణ కర్తవ్యం.
144. ఇదిగో! సశరీరుడనై సాకార స్థితిలో చెప్పవలసి వచ్చిన సమస్త యాత్రలు, పుణ్య క్షేత్రములు, పుణ్య తీర్థములు నా పాద దూళిలో ఇమిడియున్నవని స్పష్టముగ చెప్పగలను. అక్షర సత్యముగ ప్రూఫ్ చేయగలను. ఇట్టి నా పాద దర్శనమునకు నోచుకొను గృహములు ధన్యాతి ధన్యములు, పావనములు. ఇతరులవలె నా సన్నిధిలో కట్టడి రుసుములు లేవు. కేవలం పరాభక్తి, ఆత్మ విశ్వాస ఫీజులుండును. ఈ కోవకు చెందిన ఆహ్వానములను ప్రేమతో మన్నించి పూరి గుడిసెలకే కాదు, చెట్లక్రింద కాపురములు చేయువారి చెంతకైనను త్రిమూర్త్యాత్మక ప్రణవాలయ పాదములు మోపబడును. ఉచితం అనగానే సంకుచితముగ భావించరాదు. వెలకట్టాలనిన భూతల సిరి సంపదలన్ని ఒకే చోట కుమ్మరించినా నా పాద దర్శనమునకు సరిపోవు. అందులకే అస్తిర చింతన నాకెన్నడు లేదు.
145. నాది బహిర్ దృష్టి కాదు. సర్వాంతర్లీన విశ్వగర్భిత చూపు. ఒక్క క్షణము నా చూపును అలవరచుకొని చూడండి. భూ, ఖగోళములు మీయందు లయిస్తున్నట్లు తెలుసుకోగలరు. బాహ్యాకార చింతనతో ఆలోచించిన ఎంతటి వారికైనను నేను బోధపడను. భగవన్మతులు కండి. సప్త జ్ఞాన భూమికలకు పైది నా మార్గం - సత్యాత్మ భగవన్.
146. ఇతర రచనలతో నా భాష్యమును పోల్చరాదు. పైపైకి చదవటం ముఖ్యం కాదు. ఏకాగ్రచిత్తులై, తైలదారవలె ఎడతెరపిలేని ప్రగాఢ చింతన, ధారణ గలవారలై అంతర్మథనం, మననం చేయాలి. అక్షర లక్షలు పఠించాలి. అణువణువులో భావం జీర్ణించిపోవాలి. నా వాక్య స్మరణ చేయునపుడు నిష్టగ కూర్చుండి, కుడిచేతిని బిగించి, చూపుడు వ్రేలును నిలిపి ఉంచి, అందులోనుండి అతీత శక్తి తమలోకి ప్రసరిస్తున్నట్లు భావించగలగాలి. ఈ సిద్ధి చేకూరినపుడు దేహేంద్రియ మనోబుద్ధులు తట్టుకోలేని అతీత సత్తా అనుభూతి కాగలదు, నిజం. నా భాష్య గ్రంథములను దైవ స్థానములో పూజించినను దోషంలేదు. ఎందులకనగా, సర్వాతీతుని అనంత సత్తు సూక్ష్మాతి దృక్ స్వరూపముగ భాష్యములో నిగూఢపరుచబడి, లయించి యున్నది. యోగీంద్రులకీ రహస్యం పూర్తిగ గ్రాహ్యం.
147. సర్వలోక నివాసులారా! జాగ్రత్తగ వినండి. గతంలో చెప్పాను. మరల మరల ప్రకటించుచున్నాను. అది యేమనగా, సశరీరుడనై మీ మధ్యన ఈ స్థూల శరీరము వ్యవహరించినంత మాత్రాన నేను నా సర్వస్వం ఇదియే అనుకోరాదు. సర్వాతీత స్థితినుండి నా భాష్యమును వినిపించు ధ్వని డబ్బా ఈ శరీరము. అంతమాత్రముచే రాకడ, పోకడ గలవానిగ, జనన మరణ కాలచక్ర ప్రవాహంలో చిక్కిన వానిగ భావించరాదు. బాహ్యాకార చింతనతో ఆలోచించిన ఎంతటి వారికైనను నేను బోధపడను. భగవన్మతులు కండి.
148. మణులలో ఉన్న, పూలదండలో ఉన్న దారము పైకి కనిపించక వాటిని కూర్చి, చెల్లచెదరు కాకుండ ఆధారమైనట్లుగ, అనత విశ్వ పర్యంతం సర్వాంతర్యామి సూత్రం అలా వ్యాపించి యున్నదని తెలియుదురుగాక! సర్వాధిష్ఠాన సూత్రబద్ధమై వేటి స్థానంలో అవి నిలిచి ఉన్నవి. సైన్స్ సిద్ధాంతం కూడ ఈ సూత్రమును బలపరచుచున్నది. నా సిద్ధాంతము సైన్సులకు సైన్సు. ఇదిగో! సర్వమత సంబంధ గ్రంథములు, సమస్త వేదోపనిషత్ పురాణేతిహాస, ధర్మశాస్త్ర సర్వస్వం నాయందు బిందు రూపమున లయించి ఉన్నది. ఎవరు కాదనలేరు. సత్తాలేని శుష్క ప్రకటనలు నేనెన్నడు చేయను. ఆధ్యాత్మిక సంబంధమైన సమస్త గ్రంథముల సారాంశమును సర్వలయాతీత సూత్రవాక్యంలో పూరించి చెప్పగలను. ఇది అనితర సాధ్యం.
149. నాణ్యతగల మంచి సరుకును గురించి ప్రకటనలతో ప్రచారము చేయవలసిన పనిలేదు. క్రమముగ గుర్తింపు రాగలదు. ఇంకెంత కాలానికైనను నా రచనలు సమస్త భాషలలో విశ్వ వ్యాప్తం అగుట తథ్యం. ప్రతి నీవు ఇందులో భాగస్వామి కావలసిందే.
150. ఈ భూలోక సంబంధ సమస్త ఆరాధన, అనుభూతులకు అతీతుడనైన నాకు ఏ సాధనలతో ఎంతమాత్రం పనిలేదు. నాది సాధనల సిద్ధి కాదు, సహజ స్థితి. ఇట్టి నా స్థితిని వర్ణించ ఆదిశేషునకైనను అలవికాదు. నా దృష్టి భావ ప్రసారము జరిగినంతవరకు నాకు భిన్నముగ ఏదికనిపించటంగాని, వినిపించటంగాని లేదు. ఇట్టి సర్వేకత్వ, సర్వకేంద్ర స్థితినే నా స్వరూపముగ ఆరాధిస్తున్నాను. నా పూజ నాకే చెందగలదు. ఎన్ని చెప్పవలసి వచ్చినను నా నిజస్థితిని వెంట్రుక మందము కూడ తగ్గించి చెప్పను, చెప్పకూడదు. ఎల్లలు, హద్దులు నా పరిధిలో లేవు. అనంతానంతం, స్వత:స్సిద్ధం.
Reply Reply All Forward Forward
WelcomeInboxNewFolde
WelcomeInboxNewFoldersMail Optio
No comments:
Post a Comment