ఆత్మవిశ్వాసికి అసాధ్యంలేదు. ఆంబరాన్ని చుంభించే ఆలోచనలు కలిగి ఉండండి. ఆనగా అధోగతి చింతన తగదు. నానుండి కాగలదనెటి ధీమా, సాహసం అవసరం. ఆత్మస్థైర్యం, అగ్నిపర్వతంలో అంతర్లీనమైయున్న లావాలా అంతర్గత మేధశక్తిని వెలికి ప్రదర్శించండి. నాకంతటి అదృష్టంలేదని నిరాశా, నిస్పృహలతో కుప్పకూలిపోరాదు. సందేహాలకు అతీతులై నిర్భయముగ నిలువాలి.
తన అంతర్గత దివ్యశక్తిని శోధించి సాధించటమే సాధన రహస్యం. దీనిని చక్షువులతో తన భాషలో తెలియజేస్తాడు. అలాగే తాను గ్రహించిన సత్యాలకు నిదర్శనముగ కొన్ని ప్రతీకలు రూపకల్పన చేస్తాడు. తనకు వీలున్న పరిధిలో భావప్రసారం చేయును. అందులకే అంతర్ ప్రకాశ శక్తియే ధ్యేయముగ పెట్టుకోవాలి.
నీసర్వం కేంద్రీకరించిననే దప్ప దివ్య చక్షువు వికసింపదు. పరుసవేది స్పర్శచే బంగారంగా మరిన ఇనుపముక్క మరియొక ఇనుపముక్కను బంగారంగ మార్చలేదు. నిజగురుడనే పరుసవేది తన శిష్యుని మరియొక పరుసవేదిగ తయారు చేయగలడు. ఇట్టి సద్గురు శిష్య పరంపర లోకంలో చాలా అవసరం. సుఖాలను వెదకటం మానవ నైజం. లోకంలో శాశ్వత సుఖంలేదు. భోగ విలాస జీవితానికి దగ్గరైనాకొలది దైవత్వనికి దూరం కావలసి వస్తుంది. విలాస జీవితం మానవుని ఆలోచనలను మారుస్తుంది. అపుడు చింతించిన లాభంలేదు. సద్గ్రంధ పఠన, సత్పురుష సాంగత్య ప్రభావంచే తప్పును తెలుసుకుని సరిదుద్దుకోవాలి. అదే మారుమనస్సు.
సర్వాకారుడైన పరాత్పరుడు, దైవావతారుడు నరరూప ధారియైనను ఆతని ఉనికికి భంగం కలుగదు. ఏ స్థితిలోనైనను భగవంతుని పరతత్త్వ స్వభావంలో మార్పురాదని గ్రహించండి. సూర్యునియందున్న అతి పవిత్రమైన, శ్రేష్టమైన తేజస్సే గయత్రి. సూర్యుడు విశ్వసాక్షి యైనందున సూర్య భగవానుడందురు. సూర్యాంతర్గత చైతన్యమే గాయత్రి. దీనిని ఆరాధిస్తే చర్మవ్యాధి, కంటిజబ్బులు నయమగును.
సర్వేశ్వరుడనగా ప్రభువు, రక్షకుడు, యజమాని, అధికారి, శాసకుడు. సమస్త జీవకోటిని శాసించెవాడని అర్ధం. నే శాసించగలనేగాని శాసింపబడను. నన్ను శాసించే శక్తిలేదు. ఫ్రభుత్వ ఆదేశానుసారము ప్రభుత్వ కార్యాలయములన్ని పనిచేయునట్లు పంచభూతాలు, సమస్త దేవతలౌ, ప్రవక్తలు, బోధకులు నా శాసనమునకు కట్టుబడియున్నారు. సూర్యచంద్రులేగాదు మృత్యువుసైతం నా ఆదేశమునకు లోబడియున్నది. నన్ను శాసించేవారు ఎవరులేరని, నే అత్యాశ్రమవాసి నైనప్పటికి ఏ విషయంలో క్రమశిక్షణ, చట్టములను అతిక్రమించను. నాకు సర్వలోక పర్యంతం చేయవలసిందిగాని, పొందవలసిందిగాని ఏదిలేదు. ఈ పనిచేసిన లాభం, నష్టం అనిలేదు. శన్మార్గదర్శకులుగ అవతారమూర్తులు మీ మధ్యన అవతరించి సత్యవిధులను ప్రబోధిస్తున్నారు. ఇదంతయు నా ఏర్పాటే. అత్యద్భుత మహిమాన్విత దివ్యశక్తులన్నియును నా ఏలుబడిలోగలవు. సమస్త దైవావతారములకు మూలం సర్వకేంద్ర దైవం. నేనే యెహోవ, శ్రీహరల్లా, శ్రీమన్నారాయణ పరమశివ దైవం.
ధర్మశాస్త్రమంతయు గైకొని నా ఒక్క ఆజ్ఞలో తప్పినవాడు అపరాధియగును అని గతంలో విన్నారుగద! నా ఆజ్ఞను స్వీకరించగల సత్తాగల వారికి ధర్మశాస్త్ర సర్వస్వం కరతలామలకము. అనగా నాయొక్క సూచనాదేశములోనే వేదోపరిషత్, సమస్త సర్వమత ధర్మశాస్త్రముల సారమంతయు నిండియున్నదని తెలియుదురుగాక! ఆమేన్. అడుగడుగున, అణువణువున అస్తిత్వం నిండియున్నదని తెలియుము. ఉన్నదంతయు అదే చిన్మయ సత్. మీరు సత్ స్వరూపులేగాని వేరు కాదు. అలా సంకుచిత పరిధిలో మిమ్ముల సంభోదించినా, చెప్పినా అందులో మోసం ఉన్నదని తెలుసుకోండి. మేను నేనుగాదు. నేను మేనుగాదు. ప్రతిమేనుకు ఒక్క నేనుగలదు. ఏమేనుకు, ఆమేనువలె, ఏనేనుకు ఆ నేను వేరువేరా లేదా? అన్ని నేనులు ఒక్కటేనా? ఒక్కటి లేదా ఒకే ఆత్మ స్వరూపాలైనచో మానవుల మధ్యన ఇన్ని విబేధాలు, ఘర్షణలు దేనికి? ఏ నేనుకు ఆ నేనేగాదు, సకలనేనులు సత్యభగవన్ నేను స్వరూపములే. మేనుగాని నేనెవరు? నాలోనున్న నేనెవరు? నేనుకు పరిధెంత? దేహధారణకు ముందు ఈ నేనెవరు? ఎలా ఉంది? ఎక్కడ ఉంది? మరల దేహ వియోగానంతరం ఈ నేను ఏమౌతుంది? ఈ నేను పరిజ్ఞానం తెలుసుకో. నేనెవరో బోధపడిన సర్వం బోధపడుతుంది. నీలోని నిన్ను తరచి చూడు. నిన్ను నీవు చక్కగ తెలుసుకో. ఈ సమస్తం నేను తర్వాతనే.
నేనులేనిది శరీరం నిలువదు. దేహేంద్రియ మనోబుద్ధులు లేకున్నా నేనుండగలను. కాని నేను అనెటి సత్ లేని శరీరం శవము కాగలదు. అందులకే నేను అనేదే సత్యం, శివం, సుందరం, శాంతం, దయ అని నిన్ను నిర్ధారించుకో. ఇంతకాలం మీ చూపుతో చూడగలిగారు. ఇపుడు నా చూపును అలవరచుకోండి. సమస్త భిన్నత్వములంతరించి, విశ్వం విశ్వేశ్వర దైవమందిరముగ భాసిల్లగలదు. ఇదే నా చూపులోని ఘన సత్.
ఇట్టి నా చూపు సోకి, నా భావం ప్రసరించేంతవరకు ఈ అనంత విశ్వం నాకు వశమై యున్నది. దేవునకు సాధ్యంకానిది ఏదియునులేదు. నేను ఏది అంటె అది అక్షరాల జరిగితీరుతుంది. ఇదిగో! నేతి హరి కాళీ బాబా సర్వకేంద్రపిత ఏమి ఫర్వాలేదన్నారని నా పేరుచెప్పినను లేదా నే చూచి, నా చేయి మోపినను సమస్త గ్రహవ్యాధులు, భయవిపత్తులు, దు:స్స్వప్నములు తొలగి, ఎట్తి విషమైనను హరించి స్వస్థత చేకూరును. శుభం భూయాత్. స్థితికుదిరినపుడే నా వాగ్ధానం మీయందు నెరవేరబడును., మీరు సర్వకేంద్ర దైవస్థితిలో చేరదలంచిన అడ్మిషన్ ఫారాలు నింపి పంపండి. ఎవరి అడ్మిషన్ పత్రం వారివద్దనేగలదు. స్వనిష్టలో నిలిచి నింపండి. ఆపై నాకు పంపండి. స్వీకరించి వెంటనే జాయిన్ చేసుకోబడును. ఇందులో చేరినవారికి ఏనాడు పతనంలేదు.
రచన: బాబా సర్వకేంద్ర
సేకరణ: నేతి విజయదేవ్

No comments:
Post a Comment